గుంటూరులోని మల్లిక స్పైన్ సెంటర్ పరిశోధనా బృందం.. సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్‌వేజివ్ స్పైన్ సర్జరీ-ఆసియా పసిఫిక్ (ఎస్‌ఎంఐఎస్‌ఎస్-ఏపీ) వార్షిక సదస్సులో ప్రదర్శించిన పరిశోధనకు ‘బెస్ట్ పేపర్ అవార్డు’ లభించింది. భారత్‌లోని వైద్య పరిశోధనకు ఈ అవార్డు లభించడం ఇదే మొదటిసారి. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ముంబైలో జరిగిన ఎస్‌ఎంఐఎస్‌ఎస్ ఆసియా ఫసిఫిక్ వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా ఎస్‌ఎంఐఎస్‌ఎస్-ఏఎఫ్ అధ్యక్షుడు జపాన్‌కు చెందిన ప్రొఫెసర్ కొటానీ ఈ అవార్డును ప్రకటించినట్టు ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ జే నరేశ్‌బాబు ఆదివారం వెల్లడించారు. వచ్చే ఏడాది సింగపూర్‌లో జరిగే వార్షిక సదస్సులో ఈ అవార్డును అందజేయనున్నారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa