కర్ణాటకలో చిరు వ్యాపారులు వినూత్న నిరసనను చేపట్టారు. GST నోటీసులకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలను ధరించారు. రాష్ట్రవ్యాప్తంగా బేకరీల్లో టీ, కాఫీ, పాల విక్రయాలను నిలిపివేశారు. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీని మాత్రమే విక్రయిస్తున్నారు. 2021-24 మధ్య జరిగిన యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల పేమెంట్స్ దాటిన వారికి నోటీసులిచ్చారు. దీనిపై సీఎం సిద్ధరామయ్య చిరు వ్యాపారులతో ఇవాళ చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa