ప్రతి అంశంలోనూ భారత్ కంటే తామే గొప్ప అని ప్రగల్భాలు పలకుతూ.. విర్ర వీగే పాకిస్తాన్ .. రియాలిటీలోకి వస్తే మాత్రం సీన్ రివర్స్‌లో ఉంటుంది. గొప్పల కోసం ఏవో ప్రయోగాలు చేసి.. ఆఖరికి అవమానాల పాలువుతుంటుంది. తాజాగా మరోసారి దాయాది దేశానికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. తమ దేశ క్షిపణి వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో ప్రపంచానికి తెలియ చెప్పాలని భావించి దారుణంగా అభాసుపాలయ్యింది. పాక్ క్షిపణి ప్రయోగం విఫలం కావడమే కాక.. సొంత దేశ ప్రజల ఇళ్ల మీదనే కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
ఆయుధ సంపత్తిలో కూడా భారత్ కంటే తామే గొప్ప అని గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అణ్వాయుధాలు మోసుకెళ్లే షాహీన్-3 క్షిపణి పరీక్ష విఫలమైంది. జులై 22న బలూచిస్తాన్ ప్రావిన్సులో ఈ ఘటన వెలుగు చూసింది. పాక్ ప్రయోగించిన షాహీన్-3 క్షిపణి దారి తప్పి పేలిపోయిందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాకిస్తాన్ పరువు కాస్త పోయింది. ఈ విషయం బయటకు రాకుండా దాయాది దేశం జాగ్రత్త పడినప్పటికీ జరగాల్పిన నష్టం జరిగిందంటున్నారు.
ఆయుధ సంపత్తిలో మన కంటే మెరుగ్గా.. ఇంకా చెప్పాలంటే అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉన్నట్లు గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్.. క్షిపణి పరీక్షల్లో మాత్రం విఫలమవుతునే ఉందని. తాజాగా షాహీన్-3 మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించగా అది విఫలమైందని సమాచారం. ఇది అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదని ప్రచారం చేసుకున్న పాక్.. అది కాస్త ఫెయిల్ కావడంతో నోరు మెదపడం లేదని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.
బలూచిస్తాన్‌లోని డేలా బుగ్టి అనే ప్రాంతంలో షాహీన్ 3 క్షిపణి పేలిపోయిందని వార్తలు వస్తున్నాయి.. పాకిస్తాన్ మీడియా, సైన్యం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. క్షిపణి ప్రయోగం షెయిల్ కావడంతో.. ఈసమాచారం బయటకు రాకుండా పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. జులై 22న జరిగిన ఈ ప్రమాదం డేరా ఘాజీ ఖాన్ సమీపంలో జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఉంది. ఇది పాకిస్తాన్ అణ్వాయుధ కేంద్రంగా చెబుతారు.
స్థానికులు చెప్పిన దాని ప్రకారం క్షిపణి గాలిలోనే పేలిపోయింది. దాని శిథిలాలు జనాలు ఉండే ప్రాంతాల్లో పడ్డాయి. పేలుడు శబ్దం దాదాపు 50 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని చెప్పుకొచ్చారు. సైన్యం వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రజలెవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది. దీని గురించి బయటకు పొక్కకుండా పాకిస్తాన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. గతంలో కూడా షాహీన్ క్షిపణి పరీక్షలు విఫలమయ్యాయి. ఈ సంఘటనపై నెటిజనులు ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు.
అయితే డేరా ఘాజీ ఖాన్ ప్రాంతం బలూచిస్తాన్‌లో లేదని పంజాబ్‌లో ఉందని.. తాజాగా పాక్‌లో ఎలాంటి మిస్సైల్ ప్రయోగాలు జరగలేదని కొందరు చెబుతున్నారు. షాహీన్ 3 మిస్సైల్ ప్రయోగం ఫెయిల్ అంటూ వైరల్ అవుతోన్న ఫొటోలు, వీడియోల్లో ఉన్నది మిస్సైల్ కాదని కొందరు వాదిస్తున్నారు. దీనిపై పాక్ నోరు విప్పితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa