ఇప్పటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తోంది. AI వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది, అన్ని రంగాల్లో దాని ప్రావీణ్యం కనిపిస్తోంది.
మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలకు ఏఐ సెకన్లే తీసుకుని సమాధానం అందిస్తూ ఓ కొత్త ఆశగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణులు ముందే అంచనా వేసారు. అందుకే నేటి యువత విద్యా రంగంలోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ తప్పక ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి అనేది చాలా అవసరం అయింది.ఇటీవల జరిగిన ఒక సంఘటన చూస్తే, ఏఐ మన జీవితాల్లో ఎలాంటి కీలక పాత్ర పోషించగలదో మరోసారి అర్థమవుతోంది. ఏఐ సహాయంతో తన తల్లి ప్రాణాలు కాపాడుకున్నట్లు ఒక మహిళ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
“ఏఐ మా అమ్మ ప్రాణాలను కాపాడింది” మా అమ్మ గత ఏడాదిన్నర నుంచి తీవ్రమైన దగ్గుతో బాధపడుతోంది. మేము సిటీలోని అన్ని ప్రముఖ ఆస్పత్రులు, ప్రసిద్ధ వైద్యుల వద్ద ఆమెను చూపించాం. ఆయుర్వేదం, హోమియోపతి సహా అన్ని రకాల వైద్యాలను ప్రయత్నించాం, కానీ దగ్గు తగ్గలేదు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత దుర్భరంగా మారింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా మొదలైంది. వైద్యులు చెప్పారు, ఇలా మరో 6 నెలలు ఉంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని. నేను చాలా ఆందోళనలో పడిపోయాను.ఈ సమస్యను నేను పూర్తిగా ఏఐ చాట్ జీపీటీకి వివరించాను. చాట్ జీపీటీ నాకు చాలా సహాయకరమైన సూచనలు ఇచ్చింది. అందులో ఒకటి మా అమ్మ తీసుకునే బీపీ మందులు దగ్గుకు కారణమై ఉండవచ్చని చెప్పింది. ఇది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆమె దగ్గు నిరంతరం ఉండటానికి ఇది కారణమని చాట్ జీపీటీ స్పష్టం చేసింది. వెంటనే మేము వైద్యులను సంప్రదించాము. వారు మందులను మార్చి వేరే మందులు ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం మెల్లగా మెరుగుపడుతోంది.ఇది నమ్మడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ చాట్ జీపీటీ మా అమ్మకు జీవం బతకించాడు. ఓపెన్ ఏఐని రూపొందించిన సామ్ ఆల్ట్‌మన్ కు మా కృతజ్ఞతలు. అతనికి ఎప్పుడూ రుణపడి ఉంటాం అని ఆ మహిళ భావోద్వేగంతో తెలిపింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa