కంబోడియా, థాయిలాండ్ మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా, చైనా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ రెండు దేశాలూ తీసుకొచ్చిన మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను దాయిలాండ్ తాత్కాలిక ప్రధాన మంత్రి పుంథం వేచాయాచాయ్ తిరస్కరించారు. అంతేకాదు, కాంబోడియాతో సరిహద్దు వివాదం పూర్తి స్థాయి యుద్ధంగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాంబోడియాతో థాయిలాండ్, సరిహద్దు ఘర్షణ యుద్ధంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమవుతోంది. ఇప్పటికే ఈ ఘర్షణ కారణంగా 1.3 లక్షల మందికిపైగా ప్రజలు తమ నివాసాల వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. గ్రామాలను ఖాళీచేసిన శరణార్థుల గుంపులుగా గుంపులుగా దట్టమైన అడవులు, తాత్కాలిక శిబిరాలవైపు తరలుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.
దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న వివాదం.. గత కొద్ది వారాలుగా తీవ్రమవుతోంది. అయినప్పటికీ ఇటీవలి కాలంలో భారీగా సైన్యాలు మోహరింపు, పరస్పర కాల్పులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. సరిహద్దు గ్రామాల్లో ఆర్మీ ఆర్టిలరీ, డ్రోన్ల దాడులో మొదలైనట్లు తెలుస్తోంది. కాగా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఈ ఘర్షణను తీవ్రంగా ఖండించారు. రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు వచ్చి.. మానవ హక్కులను కాపాడాలని సూచించారు. కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తనవల్లే జరిగిందని పదేపదే చెప్పుకుంటోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి.. థాయిలాండ్ చెప్పుతో కొట్టినట్టయ్యింది.
శుక్రవారం రాత్రి జరగనున్న భద్రతామండలి అత్యవసర సమావేశంలో, అంతర్జాతీయ మానవతా సహాయం, శరణార్థుల రక్షణ, శాంతి చర్చలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత, దశాబ్ద కాలంగా ఎన్నడూ లేనంత ఉద్రిక్త వాతావరణం ఈసారి కనబడుతోంది. వరుసగా రెండో రోజు కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, థాయ్‌లాండ్ ప్రభుత్వం మూడో పక్షం జోక్యం కన్నా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని స్పష్టం చేసింది. థాయ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నికోర్న్‌దేజ్ బాలంకురా రాయిటర్స్‌తో మాట్లాడుతూ... ‘ఇప్పటికైతే మాకు మూడో దేశం జోక్యం అవసరం లేదు. మేము ద్వైపాక్షికంగా ఈ వివాదాన్ని పరిష్కరించగలమని నమ్ముతున్నాం’ అని అన్నారు.
విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి జలిచంద్ర కూడా ఈ ప్రకటనను సమర్థించారు. మూడో పక్షం జోక్యాన్ని మేము తిరస్కరించడం లేదు కానీ ఇప్పటికైతే ద్వైపాక్షిక చర్చల మార్గాన్ని పూర్తిగా వినియోగించలేదని భావిస్తున్నామని అన్నారు. కాగా, అమెరికా, చైనా, మలేషియాలు శాంతి చర్చలకు వేదికగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa