ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 08:26 PM

మహారాష్ట్రలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. లోనావాలా సమీపంలో ముంబై-పుణే నేషనల్ హైవేపై 20 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. కొన్ని కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఓ ట్రక్ బ్రేక్ ఫెయిల్యూరే ఈ ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa