జర్మనీలో 100 మందితో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. దీంతో నలుగురు మృతి చెందగా.. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మ్యూనిచ్‌కు 158 కి.మీ. దూరంలోని రీడ్లింగెన్ పట్టణ సమీప అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు బోగీలు బోల్తా కొట్టినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa