ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన, ఫిట్ శరీరం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చాలా మంచిది. ఇక, యోగా శరీరాన్ని సరళంగా మార్చమేడే కాకుండా అనేక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మంచి ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని యోగాసనాలను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా, మలబద్ధకంతో పాటు అనేక సమస్యల్ని తొలగించుకోవచ్చు.
ఈ రోజుల్లో మలబద్ధకం అనేది ఒక సాధారణమైన సమస్య. కానీ, చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది దాదాపు అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతుంది. అయితే, మలబద్ధకం సమస్యకు సహజ పరిష్కారం యోగా. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి మలసానం మంచి ఆప్షన్ అంటున్నారు యోగా నిపుణులు. ఈ ఆసనం వల్ల మలబద్దకం తగ్గడంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. మలసానం వల్ల కలిగే లాభాలేంటి, దీన్ని ఎలా వేయాలి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మలసానం అంటే ఏంటి?
మలసానం అనేది యోగా భంగిమ. దీనిలో ఒక వ్యక్తి నేలపై కూర్చుని మలవిసర్జన వంటి భంగిమను వేస్తాడు. ఇది తుంటి, కడుపు, తొడలు, వెన్నెముకను ప్రభావితం చేస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియను బలపరుస్తుంది. ఇక, మలసాన నడక ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది. అయితే, ఇది కాస్తా కష్టంతో కూడుకుంది. ఈ ఆసనం వేసి.. ఆ భంగిమలో కాస్తా ముందుకు నడవడమే.
మలసానం ఎలా చేయాలి?
రెండు కాళ్లను భుజాల వరకు తెరిచి నెమ్మదిగా మోకాళ్లను వంచి, చతికిలబడిన స్థితిలోకి రండి. రెండు చేతులను కలిపి నమస్తే ముద్ర చేయండి. మీ మోచేతులతో మోకాళ్లను తేలికగా నొక్కండి. వీపును నిటారుగా ఉంచండి. ఆ తర్వాత లోతైన శ్వాస తీసుకోండి. ఈ స్థితిలో 30 సెకన్ల నుంచి 1 నిమిషం వరకు ఉండి, నెమ్మదిగా లేవండి. ఈ ఆసనాన్ని 3-5 సార్లు పునరావృతం చేయండి. మలసానం రెగ్యులర్‌గా వేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మలబద్దకం నుంచి రిలీఫ్
మలసానం వేయడం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది పేగు కదలికల్ని సులభతరం చేస్తుంది. ఈ వ్యాయామం క్రమం తప్పుకుండా చేయడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. రెగ్యులర్‌గా చేయడం వల్ల మలవిసర్జన సాఫీగా పేరుకుపోతుంది. కడుపులో పేరుకుపోయిన చెత్త మలం రూపంలో బయటకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియలో మెరుగుదల
ఈ ఆసనం పేగుల కదలికను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆసనం. మలసానం వేయడం వల్ల గ్యాస్, అపానవాయువు, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది వాయువును బయటకు పంపడంలో సాయపడుతుంది.
తుంటి, వెన్నెముక స్ట్రాంగ్
మలసానం క్రమం తప్పకుండా చేయడం వల్ల కాళ్ళ కండరాలు, కీళ్ళు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అవి బలాన్ని పొందుతాయి. ఇది ఎముక వ్యాధులను కూడా నివారిస్తుంది. మీకు కీళ్ల నొప్పులు ఉంటే, వాటి నుంచి కూడా ఉపశమనం అందుతుంది. ఈ ఆసనం తుంటి కండరాల్ని బలపరుస్తుంది. అంతేకాకుండా వెన్నెముక ఫ్లెక్సిబులిటీని పెంచుతుంది. అంతేకాకుండా రెగ్యులర్‌గా చేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గిస్తుంది.
మహిళలకు మంచిది
మహిళలు మలసన భంగిమలో నడిస్తే, వారి కటి కండరాలు బలపడతాయి. పీరియడ్స్ సమయంలో నొప్పి ఉండదు. ఋతుస్రావం సమయంలో నొప్పి, కడుపు తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కటి ప్రాంతం, తుంటి, తొడలు మొదలైన వాటి కండరాలను సడలిస్తుంది. ఏకాగ్రత, దృష్టి, శ్రద్ధను మెరుగుపరుస్తుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడం చాలా కష్టం. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే మలసానం మంచిదని నిపుణులు అంటున్నారు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి మలసానం వేయాలి. మలసానం భంగిమలో నడిస్తే ఇంకా ఎక్కువ ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa