అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓవర్ లోడ్ తో వెళుతున్న పలు వాహనాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆపారు. ఓవర్ లోడ్ వాహనాల లోడు బరువు బిల్లులను ఆయన పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆయా వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, తాళ్లపాలెం వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరిందని తెలిపారు. ఓవర్ లోడ్ తో వెళితే ఈ బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, సొంత నియోజకవర్గంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చర్యలను స్థానికులు ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa