లివర్ క్యాన్సర్ ఇది అన్ని క్యాన్సర్స్ రకాల్లో మూడో అత్యంత ప్రాణాంతకమైనది. అధ్యయనాల్లో తేలిన లెక్కప్రకారం ఈ శతాబ్దం మధ్యనాటికి 1.37 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంటుందని అంచనా. లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ డేటా ప్రకారం, ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే క్యాన్సర్ ఈ వ్యాధిలో ఆరవ అత్యంత సాధారణ రూపంగా మారుతుంది. సంవత్సరానికి 870,000 నుండి 1.52 మిలియన్లకి పెరుగుతుంది. అయితే, లివర్ క్యాన్సర్ ఐదు కేసుల్లో మూడు కేసులని నివారించొచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం తెలిపింది.
సమస్య రావడానికి కారణాలు
లివర్ క్యాన్సర్ వంటి సమస్య రావడానికి ప్రమాద కారకాల్ని చూస్తే అతిగా ఆల్కహాల్ తీసుకోవడం, వైరల్ హెపటైటిస్, లివర్‌లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, MASLD(Metabolic Dysfunction Associated Steatotic Liver Disease) అని పిలిచే ఊబకాయం కారణాలుగా తెలుస్తోంది.
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం రోజున పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం, హెపటైటిస్ బి, సికి కారణమయ్యే వైరస్‌లు 2050లో కూడా లివర్ క్యాన్సర్‌కి ప్రధాన కారణాలుగా ఉంటాయని భావిస్తున్నారు. హెపటైటిస్ బిని తగ్గించేందుకు పుట్టినప్పుడే వ్యాక్సిన్స్ వేయడం మంచిది. కానీ, సబ్ సహారా ఆఫ్రికాతో సహా పేద దేశాల్లో వ్యాక్సిన్ వంటి సదుపాయం తక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది. వ్యాక్సినేషన్ రేట్ పెంచకపోతే హెపటైటిస్ బి 2015 నుంచి 2030 మధ్య 17 మిలియన్ల మంది మరణాలకి కారణమవుతుందని అంచనా.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల
2050 నాటికి ఆల్కహాల్ వినియోగం లివర్ క్యాన్సర్ కేసుల్లో 21 శాతానికి పైగా కారణమవుతుందని అంచనాలు చెబుతున్నాయి. 2022 నుండి రెండు శాతం పాయింట్లకి పైగానే ఉంది. కాబట్టి, ముందునుంచీ జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ కారణంగా లివర్ క్యాన్సర్‌తో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి.
ఊబకాయంతో
అధిక బరువు కారణంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం 11 శాతానికి పెరుగుతుందని, ఇది రెండు పాయింట్లకి పైగా పరిశోధకులు చెబుతున్నారు. ఈ అంశంపైనే అందుబాటులో ఉన్నఆధారాలను సమీక్షించిన పెద్ద ఎత్తున అధ్యయనం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్లుగా పరిశోధకులు చెబుతున్నారు. లివర్ క్యాన్సర్‌ని నివారించగల ప్రమాదం గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, అమెరికా, యూరప్, ఆసియాలో లివర్ ఫ్యాట్ సమస్య గురించి ఊబకాయం, షుగర్ ఉన్నవారిని హెచ్చరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
లివర్ క్యాన్సర్ అంటే
లివర్ క్యాన్సర్ అంటే లివర్‌లో క్యాన్సర్ కణాలు పెరగడమే. ఇది కణితిగా మారి మొదట్లో లివర్‌లో మొదలవుతుంది. లేదా శరీరంలోని ఇతర భాగాలకి వ్యాపిస్తుంది. ఇది హెపాటోసెల్యూలార్ కార్సినోమా కాలేయ క్యాన్సర్‌లో అత్యంత సాధారణ రకం. ప్రైమరీ క్యాన్సర్ అంటారు. మళ్లీ ప్రైమరీ క్యాన్సర్స్‌లో రకాలు ఉంటాయి.
అవిహెపాటోసెల్యూలార్ కార్సినోమా : ఇది కాలేయ కణాల్లో మొదలయ్యే క్యాన్సర్. పెద్దవారిలో వచ్చే అత్యంత సాధారణ రకంఇంట్రాహెపాటిక్ కోలాంగియోకార్సినోమా : పిత్త వాహికల్లో వచ్చే క్యాన్సర్హెపాటోబ్లాస్టోమా : పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్వీటితో పాటు ఫైబ్రోమెల్లారి నాడ్యులర్ హెపాటోమా, యాంజియోసార్కోమా, హెపాటోసెల్లార్ కార్సినోమా రకాలు ఉన్నాయి.
సెకండరీ లివర్ క్యాన్సర్ : ఇవి శరీరంలోని ఇతర భాగాల్లో అంటే పెద్ద ప్రేగు, ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌లో ఏర్పడతాయి.
సమస్య రాకుండా
సమస్య రావడానికి కారణాలు తెలిసాయి కాబట్టి, ముందునుంచే సమస్యని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలంటే..
హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలిమంచి పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి.
రెగ్యులర్‌గా వర్కౌట్ చేయాలి. రోజుకి కనీసం 30 నిమిషాల వర్కౌట్ ముఖ్యంబరువుని మెంటెయిన్ చేయాలి. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించుకోవాలి. ఎప్పటికప్పుడు చెకప్స్ చేసుకోవడం వల్ల సమస్యని ముందునుంచే రాకుండా జాగ్రత్త పడొచ్చు. హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ వేయుంచాలి. ఆల్కహాల్‌ని తగ్గించాలి. షుగర్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యని దూరం చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa