వర్షాకాలంలో జ్వరం, జలుబు, తలనొప్పులకు పారాసిటమాల్ ఎక్కువగా వాడుతారు. కానీ, తాజా అధ్యయనంలో ఇది ఎక్కువగా వాడితే ప్రమాదకరమని తెలిసింది. జీర్ణాశయ పుండ్ల రక్తస్రావం ముప్పు 24%, పేగుల్లో 36%, కిడ్నీ వ్యాధి 19%, గుండె వైఫల్యం 9%, బిపి 7% పెరుగుతాయని స్పష్టం అయింది. వృద్ధుల్లో దీర్ఘకాలం వాడటం ప్రమాదకరం. చిన్న చిన్న వాటికి ట్యాబ్లెట్‌లు వేసుకోకుండా ఇంటి చిట్కాలు, సహజ మార్గాలు పాటిస్తే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa