ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వ కనుగొనిక.. గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌పై ప్రభావం తప్పదా?

international |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 02:23 PM

ప్రపంచ బంగారం ధరలు వరుసగా పెరుగుతున్న ఈ సమయంలో, చైనా నుంచి సంచలనాత్మక సమాచారం వెలుగులోకి వచ్చింది. హునాన్ ప్రావిన్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వ బయటపడిందని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ గనిలో లక్షల టన్నుల బంగారం ఉండే అవకాశముందని నిపుణుల అంచనా.
ఈ గని ద్వారా చైనా అంతర్జాతీయ బంగారు మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశముంది. ఇప్పటికే బంగారు నిల్వల పరంగా ప్రపంచంలో అగ్రస్థానాల్లో ఉన్న చైనా, ఈ కొత్త గనితో మరింత శక్తివంతమైన స్థానాన్ని పొందవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
బంగారం డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ గని చైనాకు ఆర్థికంగా భారీ లాభాలను అందించనుంది. మరోవైపు, ఇది ప్రపంచ బంగారు ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. చైనా ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa