ఈ రోజుల్లో చాలా మంది ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం కానప్పటికీ ఎక్కువ బాధించే సమస్య ఒకటి ఉంది. అదే పిరుదులపై కురుపులు లేదా చీము గడ్డలు. ఈ సమస్య చాలా మందికి ఉంటుంది. ఇది ఎవరికీ కూడా చెప్పుకోలేని సమస్య. శరీరంలోని ఏ భాగంలోనైనా వెంట్రుకలు దాని మూలం నుంచి విరిగిపోయినప్పుడు అక్కడ కురుపు వస్తుంది. దీనికి ప్రారంభంలో చికిత్స చేయకపోతే, దానిలో చీము ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది నొప్పితో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే, కొన్ని ఇంటి చిట్కాలు ఈ సమస్యను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేప ఆకులు లేదా బెరడు
వేప చెట్టులో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇక, వేపాకులు, బెరడులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కురుపుల్ని నయం చేయడంలో సాయపడతాయి. ఇందుకోసం వేపాకులు, వేప బెరడును కొద్దిగా మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని కురుపులు ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచండి. ఆ తర్వాత ఉదయం శుభ్రమైన నీటితో కడగాలి. ఈ పేస్టును కావాలంటే మీరు పగలు, రాత్రి రెండూ సమయాల్లో అప్లై చేయవచ్చు. ఈ చిట్కా వల్ల కురుపులు త్వరలోనే నయమవుతాయని నిపుణులు అంటున్నారు.
పసుపు
వేడి కురుపులు, చీము గడ్డలు, బొబ్బలు సమస్య ఏదైనా పసుపు మంచి ఆప్షన్. దీనిని పురాతన కాలం నుంచి వాడుతున్నారు. పసుపులో శోథ నిరోధక, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ చిట్కా కోసం ఒక టీస్పూన్ పసుపులో చిటికెడు నిమ్మరసం కలపండి. ఈ పేస్ట్‌ను ఒక చెంచాలోకి తీసుకుని, గ్యాస్‌పై వేడి చేయండి. ఆ తర్వాత ఈ పేస్టుని పిరుదులపై ఉన్న కురుపులపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే పరిశుభ్రమైన నీటితో క్లీన్ చేసుకోండి. ఓ రెండు సార్లు ఈ చిట్కా వాడిన తర్వాత వేడి కురుపులు వాటి నొప్పి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
వెల్లుల్లి
వెల్లుల్లి చిట్కా కూడా పిరుదులపై మీకు ఇబ్బంది కలిగించే కురుపులు లేదా చీము గడ్డల్ని తగ్గిస్తుంది ఇందుకోసం.. వెల్లులి రెబ్బల్ని తీసుకుని వాటిని మెత్తగా చేసి పేస్టులా చేసుకోండి. ఈ పేస్ట్‌ను కురుపులు ఉన్న ప్రాంతాల్లో పూయాలి లేదా మీరు దాని రసాన్ని బొబ్బలపై కూడా అప్లై చేయవచ్చు. ఈ రెండు మార్గాలు కురుపుల్ని నయం చేస్తాయి. ఇది అప్లై చేసి ఓ రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయాన్నే శుభ్రమైన నీటితో క్లీన్ చేసుకోండి. పగటి పూట ఓ గంట ఉంచుకుంటే సరిపోతుంది.
తమలపాకులు
పిరుదులపై ఉన్న కురుపుల్ని నయం చేయడానికి, అవి పెరగకుండా నిరోధించడానికి తమలపాకుల్ని వాడవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా మొదటి వాటిని ఒక గుడ్డ సాయంతో కురుపుపై కొద్దిగా వేడి చేయాలి. ఆ తర్వాత ఆముదం పూసిన తమలపాకును కురుపుపై గుడ్డ సాయంతో కట్టండి. ఈ చిట్కా ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు. రాత్రి ఈ చిట్కా తర్వాత కురుపు నుంచి చీము బయటకు వచ్చి.. మీకు రిలీఫ్ లభిస్తుంది.
ఇవి కూడా ముఖ్యం
* వేడి ఆవిరి ద్వారా తాపడం చేస్తే పిరుదుల ఉన్న కురుపులు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఆ ప్రాంతాన్ని శుభ్రంగా క్లీన్ చేసి.. వేడి నీటిలో ముంచిన గుడ్డను కురుపుపై ఉంచండి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
* పిరుదుల దగ్గర శుభ్రత విషయంలో లైట్ తీసుకోవద్దు. స్నానం చేసే సమయంలో పిరుదుల్ని బాగా శుభ్రం చేసుకోండి. ఇక్కడ తేమ పేరుకుపోవడం వల్ల కురుపులు వస్తాయి.
* టైట్ జీన్స్, టైట్ అండర్ వేర్ ధరించడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అందుకే వదులుగా ఉన్న దుస్తులు ధరించడం మంచిది.
* అంతేకాకుండా తగినంత నీరు తాగడం మంచిది. తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇలాంటి సమస్యలు రావు.
* జంక్ ఫుడ్, చిరు తిండులు తినడం మానుకోండి. వీటిని తినడం వల్ల శరీరంలో వేడి ఎక్కువై.. ఇలాంటి కురుపులు వస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa