ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిద్ర లేవగానే ఈ పనులు చేసి సులువుగా బరువు తగ్గొచ్చు

Life style |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 11:29 PM

బరువు తగ్గడానికి ప్రతిసారీ భారీ వర్కౌట్స్ చేయాల్సిన పని లేదు. సింపుల్ గా చిన్న చిన్న పనులు చేస్తూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇదే విషయాన్ని చెబుతున్నారు ఓ ఫ్యాట్ లాస్ కోచ్. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన తరవాత ఓ 5 పనులు చేస్తూ బరువు తగ్గవచ్చు అని వివరించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ ఆధారంగా చూస్తే..బరువు తగ్గడం అంత కష్టమైన పని ఏమీ కాదు అనిపిస్తుంది. పైగా ఆమె చెప్పిన ఆ 5 చిట్కాలు కూడా దాదాపు అందరూ ఫాలో అవ్వగలిగేవే. ఇంట్లో దొరికే పదార్థాలనే ఆమె చెప్పినట్టుగా తీసుకుంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది. మరి ఆమె చెప్పిన ఆ 5 పనులు ఏంటి. ఏం చేస్తే సులువుగా బరువు తగ్గవచ్చు అనే వివరాలు తెలుసుకుందాం.


దాల్చిన చెక్క నీరు


బరువు తగ్గాలనుకునే వారు ఉదయం గోరు వెచ్చని నీరు తీసుకుంటారు. ఇంకొందరు అందులో నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. ఈ రెండూ ఎఫెక్టివ్ గా పని చేసే చిట్కాలే. అయితే..నిమ్మకాయ మరీ అతిగా వాడకూడదు. దీని వల్ల మంచి ఎంత జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. అసిడిటీ సమస్య ఉన్న వారు వీలైనంత వరకూ నిమ్మరసం వాడకపోవడమే మంచిది. అయితే..అందుకు బదులుగా దాల్చిన చెక్క వాడితే జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు కొవ్వు కూడా కరిగిపోతుంది. అంతే కాదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవడంలోనూ దాల్చిన చెక్క చాలా బాగా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతాయి. టాక్సిన్స్ ని బయటకు పంపించి అధికంగా ఉన్న కొవ్వుని కరిగిస్తాయి. ఓ కప్పు వేడి నీళ్లలో దాల్చిన ఓ చెక్క వేసుకుని ఆ నీటిని వడబోసి తాగాలి. ​


బ్రేక్ ఫాస్ట్ లో ఇవి బెటర్


బరువు పెరగడానికి ముఖ్య కారణం ఆకలి ఎక్కువగా ఉండడం. అయితే ఇది అనారోగ్యకరమైన ఆకలి. ఎప్పుడు పడితే అప్పుడు క్రేవింగ్స్ వస్తాయి. ఆ సమయంలో ఏది పడితే అది తినేస్తుంటారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినేది ఈ సమయంలోనే. వాటి ద్వారానే కొవ్వు పదార్థాలు ఎక్కువ మొత్తంలో లోపలకు వెళ్తాయి. అయితే..ఈ అనారోగ్యకరమైన ఆకలి తగ్గాలంటే బ్రేక్ ఫాస్ట్ లో ఏం తీసుకోవాలో చెప్పారు వెయిట్ లాస్ కోచ్ ఎరిక్. తప్పనిసరిగా ఉదయం నిద్ర లేచిన తరవాత గ్రీక్ యోగర్ట్ లో చియా సీడ్స్ కలుపుకుని తీసుకోవాలని సూచించారు. ఈ రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చియా సీడ్స్ వల్ల పొట్ట నిండినట్టుగా అవుతుంది. ఫలితంగా అంత త్వరగా ఆకలి అనిపించదు. అదే సమయంలో ఇన్సులిన్ హార్మోన్ కూడా సరైన విధంగా రిలీజ్ అవుతుంది. తద్వారా బరువు తగ్గడానికి వీలవుతుంది.


ఇవి అవాయిడ్ చేయాలి


ఉదయం పూట ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో అదే రోజంతా మీ మూడ్ ని డిసైడ్ చేస్తుంది. ఎక్కువ మోతాదులో ఆయిల్ ఫుడ్ తీసుకుంటే రోజంతా మగతగా అనిపిస్తుంది. పైగా జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. అంత త్వరగా అరగదు. అందుకే వీలైనంత వరకూ ఉదయం లైట్ ఫుడ్ తీసుకోవాలి. అయితే..ఫ్యాట్ లాస్ కోచ్ ఎరిక్ కొన్ని పదార్థాలు ఉదయం అసలు తినకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా చక్కెర, రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ ఉంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు తీసుకోకూడదని చెబుతున్నారు. వీటిలో హై ఇన్సులిన్ ఉంటుంది. వీటి వల్ల అంత త్వరగా కొవ్వు కరగదు. వెయిట్ లాస్ డైట్ లో ఉన్న వారు ఈ ఫుడ్స్ తింటే బరువు తగ్గడం ఆలస్యం అవడంతో పాటు లేనిపోని సమస్యలు వస్తాయి.


కాఫీ అప్పుడే తాగాలి


చాలా మందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. నిద్ర లేవగానే ఓ కప్పు కాఫీ తాగితే తప్ప మిగతా పనులు చేయరు. కానీ..ఈ అలవాటు అసలు మంచిది కాదు అని ఇప్పటికే చాలా మంది ఎక్స్ పర్ట్స్ వారించారు. అయితే.. సరిగ్గా ఎప్పుడు కాఫీ తాగాలో వివరించారు ఫ్యాట్ లాస్ కోచ్ ఎరిక్. కాఫీ ఉదయమే తీసుకుంటే కార్టిసాల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఫలితంగా ఆందోళనగా అనిపిస్తుంది. అలా కాకుండా ప్రొటీన్ ఉండే బ్రేక్ ఫాస్ట్ చేసిన తరవాతే కాఫీ తాగాలని సూచిస్తున్నారు ఎరిక్. అది కూడా 30 గ్రాముల ప్రొటీన్ మాత్రమే ఉండేలా చూసుకోవాలని వివరించారు. ఇలా చేయడం వల్ల కార్టిసాల్ హార్మోన్స్ స్థిరంగా ఉంటాయి. అదే సమయంలో మెటబాలిజం కూడా సరిగ్గా ఉంటుంది. వీలైనంత వరకూ పాలతో చేసిన కాఫీ కాకుండా బ్లాక్ కాఫీ తాగడం మంచిది.


సూర్యరశ్మి అవసరం


సూర్యరశ్మి తగలకుండానే రోజంతా గడిపేస్తున్నారు. దీని వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ వయుసులోనే చర్మం ముడతలు పడిపోయి ముసలి వారిలా అయిపోతున్నారు. విటమిన్ డి అందకపోతే ఇలాగే జరుగుతుంది. అయితే..విటమిన్ డి అందడం అనేది కేవలం అందం కోసమే కాదు. ఆరోగ్యం కోసం కూడా. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారు తప్పనిసరిగా సన్ లైట్ తగిలేలా చూసుకోవాలి. కనీసం ఓ పది నిముషాల పాటు ఎండలో ఉండాలి. అదే సమయంలో వాకింగ్ చేయడం ఇంకా మంచిది. ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి వాకింగ్ ఎంతగానో తోడ్పడుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa