ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో డ్రైవర్ మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో జరిగింది. సోమవారం తెల్లవారుజామున గుంతకల్లు నుంచి కర్ణాటకకు వెళ్తున్న లారీ.. ఎదురుగా ఐరన్ లోడ్‌తో వస్తున్న లారీని గడేకల్లు సమీపంలోని జాతీయ రహదారిపై ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐరన్ లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుని మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa