పంజాబ్‌లోని మొహాలీ ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొహాలీ నగరంలోని ఫేజ్ 9లో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa