దిల్లీలో పార్కింగ్ వివాదం కారణంగా హత్య జరగడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11 గంటల సమయంలో జంగ్పురా భోగల్ లేన్‌లో ఓ వ్యక్తి తన స్కూటీని పార్క్ చేశారు. నటి హ్యుమా ఖురేషీ బంధువు ఆసిఫ్ ఖురేషీ ఆ టూవీలర్‌ను అక్కడినుంచి తీసేయాలని కోరారు. ఈ విషయంలో కొందరు వ్యక్తులు ఖురేషీతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఆసిఫ్ ఖురేషీపై వారంతా పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో ఆసిఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa