స్మాల్ క్యాప్ కేటగిరి, ట్రేడింగ్ రంగానికి చెందిన చంద్ర ప్రభు ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ తమ షేర్ హోల్డర్లకు అదిరే శుభవార్త అందించింది. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇటీవలే సమావేశమై బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలుపారు. ఈ బోనస్ ఇష్యూ రికార్డ్ తేదీలోపు షేర్లు కొన్న వారికి అర్హత లభిస్తుంది. 2 షేర్లు కొన్న వారికి 1 షేరు ఉచితంగా బోనస్ రూపంలో లభిస్తుంది. మరోవైపు ఈ షేర్ గతవారం రోజుల్లో 10 శాతం లాభాన్ని అందించింది. చంద్ర ప్రభు ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది ఒక పెన్నీ స్టాక్ .
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. చంద్ర ప్రభు ఇంటర్నేషనల్ కంపెనీ బోర్డు డైరెక్టర్స్ 1:2 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయడానికి ఆమోదం తెలుపారు. అంట రికార్డు తేదీ నాటికి రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2 ఈక్విటీ షేర్లను డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్న వారికి రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరును బోనస్ రూపంలో ఉచితంగా అందించేందుకు కంపెనీ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఈ బోనస్ షేర్ల జారీ రికార్డు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. రికార్డు డేట్ లోపు ఎవరైతే షేర్లను తమ డీమ్యాట్ ఖాతాలో కలిగి ఉన్నట్లయితే వారికి ఈ బోనస్ షేర్లు అక్టోబర్ 7వ తేదీన పొందుతారని కంపెనీ తెలిపింది.
క్రితం రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో చంద్ర ప్రభు ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేరు 0.096 శాతం లాభంతో రూ. 20.90 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ రేటు రూ. 33.40, కనిష్ఠ ధర రూ. 15.88 వద్ద ఉన్నాయి. గత వారంలో ఈ షేరు ధర 10 శాతం లాభాన్ని అందించింది. గత నెల రోజుల్లో 6 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 11 శాతం నష్టపోయింది. గత ఏడాదిలో 13 శాతం నష్టపోయింది. గత ఐదేళ్లలో 528 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 39 కోట్ల వద్ద ఉంది. ఈ కథనం సమాచారం కోసమే. ఎవరినీ పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించేందుకు కాదు. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నిపుణుల సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa