కొంతమందికి శాఖాహారం అంటే ఇష్టం. మరికొందరికి నాన్ వెజ్ అంటే ఇష్టం. అయితే, చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్, చేప, రొయ్యలు ఏదైనా సరే ఓ పట్టు పట్టాల్సిందే. ఇక, సండే వచ్చిందంటే ఆ లెక్కే వేరు. చికెన్, మటన్, చేపలు అన్నీ వండుకుని తినాల్సిందే. చాలా మంది నాన్ వెజ్ వంటకాల్ని అన్నం, చపాతీలు, లేదా పలావ్‌తో తింటారు. అయితే, నాన్ వెజ్ ఏది తిన్నా సరే.. వాటితో కలిపి లేదా తిన్న తర్వాత కొన్ని ఆహారాలు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఈ ఆహారాలు తినడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు
చికెన్, మటన్, చేపలు ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా సరే తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు అంటున్నారు. పాలు, నాన్-వెజ్ కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. మీరు నాన్-వెజ్ తిన్నట్లయితే, ఆ తర్వాత పాలు తాగకండి. ఎందుకంటే పాలు, నాన్-వెజ్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు ఏర్పడతాయి. అంతేకాకుండా నాన్ వెజ్ జీర్ణమవ్వడానికి టైమ్ పడుతుంది. పాలతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇక, చేపలు, మాంసం లేదా చికెన్ చాలా వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే, పాలు చల్లటి స్వభావంతో కలిగి ఉంది. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.
పెరుగు
పాలు లాగే.. పెరుగు కూడా డైయిరీ ప్రొడక్ట్. అందుకే నాన్ వెజ్ తిన్న తర్వాత పెరుగు తినకూడదు. కానీ, మనలో చాలా మంది నాన్ వెజ్ తిన్నాక పెరుగు తింటారు. నిజానికి నాన్ వెజ్ శరీరంలో వేడిని పెంచుతుంది. మరోవైపు పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ తర్వాత వెంటనే పెరుగు తినడం వల్ల అది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీంతో, కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఈ కాంబినేషన్ అవాయిడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
టీ
మీకు నాన్ వెజ్ తిన్న వెంటనే టీ తాగే అలవాటు ఉంటే, వెంటనే ఇది మానుకోండి. నాన్ వెజ్ మాత్రమే కాదు ఏ ఆహారం తిన్నా ఆ తర్వాత టీ తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మాంసాహారం తిన్న తర్వాత టీ తాగకూడదు. దీని కారణంగా కడుపులో మంట, నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ కాంబినేషన్ అవాయిడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పండ్లు
చేపలు, చికెన్ లేదా మటన్ వంటి మాంసాహారం తిన్న తర్వాత ఎప్పుడూ పండ్లు తినకూడదు. మాంసాహారం తర్వాత పండ్లు తినడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. శరీరంలో టాక్సిన్స్ పెరుగుతాయి. కొన్ని రోజులు లేదా చాలా కాలం తర్వాత దీని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
తేనె
చికెన్ లేదా మటన్ తర్వాత పొరపాటున కూడా తేనె తీసుకోకూడదు. ఇది మీ శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలు పెరుగుతాయి. అంటే మంట, వాపు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా తేనె జీర్ణమవ్వడానికి సమయం తీసుకుంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అంతే. దీంతో, కడుపులో గందరగోళం జరిగే అవకాశం ఉంది.
పండ్ల రసాలు లేదా జ్యూసులు
మీరు నాన్-వెజ్ తిన్న తర్వాత జ్యూస్ కూడా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చాలా జ్యూస్‌లు చల్లదనాన్ని కలిగిస్తాయి. మరోవైపు, చికెన్ లేదా మటన్ వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కాంబినేషన్ టోటల్ వ్యతిరేకం. అందుకే ఈ కాంబినేషన్ అవాయిడ్ చేయాలి. నాన్-వెజ్ తిన్న తర్వాత 2-3 గంటల వరకు జ్యూస్ తాగకూడదు. ఈ కాంబినేషన్స్ అన్నీ జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. కడుపులో మంట, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు పెరుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa