ఈసారి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మరో 50 రోజుల్లో మహిళ వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముంబైలో ‘ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్-2025’ ట్రోఫీని ఆవిష్కరించారు. ఐసీసీ ఛైర్మన్ జై షా, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తాతో పాటు భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్, ప్రస్తుత టీమిండియా మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, జెమీమా రోడ్రిగ్స్, ఈ ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇక, ఈ మెగా ఐసీసీ టోర్నీ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. అయితే 2016 తర్వాత భారత్ మహిళల ఐసీసీ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2016లో భారత్‌లో మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa