AP: 2027 డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. ‘డయాఫ్రం వాల్ పొడవు 1396 మీటర్లకు 500 మీటర్ల నిర్మాణం పూర్తి అయింది. 3 ట్రెంచ్ కట్టర్లు, 3 గ్రాబర్లలో డయాంఫ్రం వాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత ఉండదు’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa