ఐదేళ్ల విరామం తర్వాత భారత్–చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు వచ్చే నెల పునఃప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఈ సర్వీసులు నిలిచిపోయాయి. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్యలు కొనసాగడంతో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విమాన సర్వీసుల పునరుద్ధరణకు కేంద్రం చర్యలు చేపట్టడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa