బేతంచెర్ల శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 76 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ లెక్కింపులో భాగంగా 69, 12, 094 రూ. లు నగదు, 33గ్రా. బంగారం, 2. 3 కేజీల వెండి సమకూరిందని ఉప కమిషనర్ ఈవో రామాంజనేయులు మంగళవారం తెలిపారు. నంద్యాల జిల్లా దేవదాయ అధికారి మోహన్ , దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో దేవస్థాన సిబ్బంది పాల్గొని హుండీ లెక్కించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa