ఢిల్లీలో వీధి కుక్కల కేసులో ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఆ పిటీషన్లపై గురువారం సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకుండా చేయాలని, వాటిని షెల్టర్‌లకు తరలించాలని సుప్రీం ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును ఖండిస్తూ పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. గత ఆదేశాలపై ఇవాళ ధర్మాసనం స్టే ఇవ్వలేదు. కానీ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa