AP: విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి దిగిన ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతు అయ్యారు. విశాఖలోని ఓ వివాహానికి హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం గురువారం వచ్చింది. స్నానానికి దిగిన దంపతుల్లో ఓ వ్యక్తి సురక్షితంగా బయటకు రాగా, మహిళ (50) చనిపోయింది. వారిని కాపాడేందుకు వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa