టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్) పెద్ద ఎత్తున సంచలనాలు సృష్టిస్తోంది. ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్‌జీపీటీ కూడా దీనిపైనే ఆధారపడి పనచేస్తుంది. ఇంకా ఏఐపై పనిచేసేలా గూగుల్ నుంచి జెమిని, మెటా ఏఐ, ఎక్స్ నుంచి గ్రోక్ సహా పర్‌ప్లెక్సిటీ, క్లౌడ్ ఏఐ ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇక వీటి వినియోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకు ఇవి ఉద్యోగుల్ని భర్తీ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఐటీ రంగంలో కూడా దీని ప్రభావం ఎక్కువే ఉంది. డెలివరీ, కస్టమర్ సర్వీస్ ఇలా ఎన్నో రంగాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
>> అత్యాధునిక ఏఐ వ్యవస్థల్ని సరిగ్గా వినియోగించుకోకపోతే పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి. ఇక గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇటీవల లాస్ వేగాస్‌లో జరిగిన Ai4 సమావేశంలో సంచలన కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఏఐ.. మానవాళిని తుడిచిపెట్టేసే అవకాశం ఉందని అన్నారు. దీనిని నివారించేందుకు ఇప్పుడు భావోద్వేగ స్పందనలు ఉండేలా ఏఐ వ్యవస్థల్ని తీసుకురావాలని అన్నారు. వాటికి మానవుల సంరక్షణ గురించి అవగాహన కల్పించాలని చెప్పారు.
>> ఏఐ వ్యవస్థలు ప్రస్తుతానికి మాత్రం మానవులు నియంత్రణలోనే ఉన్నప్పటికీ.. ఎప్పటికీ ఇలానే కొనసాగుతాయని మాత్రం చెప్పలేమని హింటన్ అన్నారు. భవిష్యత్తులో ఏఐ మనిషి మేధస్సును అధిగమిస్తే.. అప్పుడు మన పరిమితుల్ని దాటేందుకు కొత్త మార్గాల్ని కూడా అన్వేషించగలవని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల కిందట.. ఒక ఏఐ వ్యక్తిగత రహస్యాల్ని బయటపెట్టేస్తానని ఇంజినీర్‌ను హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి అనేక సమస్యల్ని భవిష్యత్తులో మానవులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
>> మానవాళికి ముప్పు తగ్గే అవకాశాలు తీసుకురావాలంటే.. తల్లీ బిడ్డల మాదిరిగా భావోద్వేగాలు కలిగేలా ఏఐ వ్యవస్థల్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికీ ఆరోగ్య రంగంలో మాత్రం.. ఏఐ వినియోగంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని హింటన్ వివరించారు. ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో పురోగతి, చికిత్స ప్రణాళిక, రోగ నిర్ధారణకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa