తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణలో 2020-21లో 1,578గా ఉన్న అబార్షన్లు 2024-25 నాటికి 16,059కి చేరి.. 917% వృద్ధిని నమోదు చేశాయి. ఇక్కడ గంటకు సగటున రెండు అబార్షన్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 367% పెరుగుదలతో.. ఏడాదికి 50,000కు పైగా అబార్షన్లు నమోదవుతున్నాయి. అవాంఛిత గర్భాలు, ఆరోగ్య సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. సురక్షితమైన వైద్య సేవలు, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa