18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటరుగా మారాలి, ఓటు వేయాలని CEC జ్ఞానేశ్ కుమార్ అన్నారు. ‘ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాయని, అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ ఒకే రాజకీయ పార్టీల మధ్య ఎలా వివక్ష చూపగలదు? ఎన్నికల కమిషన్‌కు, అందరూ సమానమే. ఎవరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఎన్నికల కమిషన్ తన రాజ్యాంగ విధి నుండి వెనక్కి తగ్గదు’ అని CEC అన్నారు.ఎంతగా దుష్ప్రచారం చేసినా తమ పని చేసుకుంటూ వెళ్లిపోతామని CEC జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి దేశంలో ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని ఫైరయ్యారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మెషీన్ రీడబుల్ జాబితాపై నిషేధం ఉందని పేర్కొన్నారు.