చందనం.. పురాతన కాలం నుంచి చర్మ సంరక్షణలో ఒక అద్భుతమైన పదార్థం. దీన్ని ఆయుర్వేదంలో కూడా బాగా వాడతారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ మరియు స్కిన్-బ్రైటెనింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది నల్ల మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా మార్చడంలో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చందనంలో ఉండే సహజ బ్లీచింగ్ గుణాలు నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, మొటిమల మచ్చలను తగ్గించి, చర్మం రంగును మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడి, చర్మ ముడతలు, సన్నని గీతలు రాకుండా నివారిస్తాయి. పొడి చర్మానికి తేమను అందించి, మృదువుగా ఉంచుతుంది. ఇలాంటి చందనంతో బెస్ట్ ఫేస్ ప్యాక్స్, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చందనం, పసుపు, పాలు ప్యాక్
* కావాల్సిన పదార్థాలు
చందనం పొడి - ఒక టేబుల్ స్పూన్
పసుపు - చిటికెడు
పచ్చి పాలు - తగినంత
* తయారీ విధానం, వాడే పద్ధతి
అన్నింటినీ కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేయండి.
* ప్రయోజనాలు
ఇది నల్ల మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పసుపులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను నివారిస్తాయి.
చందనం, నిమ్మరసం, కొబ్బరి నూనె ప్యాక్
* కావాల్సిన పదార్థాలు
చందనం పొడి - ఒక టేబుల్ స్పూన్
నిమ్మరసం - కొన్ని చుక్కలు
కొబ్బరి నూనె - అర టీ స్పూన్
* తయారీ విధానం, వాడే పద్ధతి
అన్నింటినీ కలిపి పేస్ట్ చేయండి. ముఖానికి పట్టించి, మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయండి.
* ప్రయోజనాలు
నిమ్మరసం సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచి మచ్చల్ని తగ్గించడంలో సాయపడుతుంది. టాన్‌ను కూడా తగ్గిస్తుంది.
చందనం, ముల్తానీ మట్టి, టమాటా రసం
* కావాల్సిన పదార్థాలు
చందనం పొడి - అర టీ స్పూన్
ముల్తానీ మట్టి - అర టీ స్పూన్
టమాట రసం - తగినంత
* తయారీ విధానం, వాడే పద్ధతి
అన్నింటినీ బాగా కలిపి పేస్ట్ చేయండి. ఆ తర్వాత పేస్టుని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి.
* ప్రయోజనాలు
జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ మంచి ఆప్షన్. అదనపు నూనెను గ్రహించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
చందనం, బార్లీ, పెరుగు ప్యాక్
* కావాల్సిన పదార్థాలు
చందనం పొడి - ఒక టేబుల్ స్పూన్
బార్లీ పిండి - ఒక టేబుల్ స్పూన్
పుల్లటి పెరుగు - తగినంత
* తయారీ విధానం, వాడే పద్ధతి
ఈ మూడు పదార్థాలను కలిపి మెత్తటి పేస్ట్ చేయండి. ముఖంపై మచ్చలు ఉన్న చోట అప్లై చేసి 20-30 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
* ప్రయోజనాలు
బార్లీలోని గుణాలు మచ్చలను తగ్గించడంలో సాయపడతాయి. పెరుగు చర్మాన్ని తేమగా ఉంచి శుభ్రపరుస్తుంది.
చందనం, రోజ్ వాటర్, తేనె ప్యాక్
* కావాల్సిన పదార్థాలు
చందనం పొడి - ఒక టేబుల్ స్పూన్
రోజ్ వాటర్ - ఒకటి, రెండు టేబుల్ స్పూన్లు
తేనె - అర టీస్పూన్
* తయారీ విధానం, వాడే పద్ధతి
అన్నింటినీ కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్టును ముఖానికి, మెడకు అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేయండి.
* ప్రయోజనాలు
రోజ్ వాటర్ చర్మానికి టోనర్‌గా పనిచేస్తుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచి మచ్చలను తగ్గిస్తుంది. ఇది కాంతివంతమైన, తాజాగా కనిపించే చర్మాన్ని అందిస్తుంది.
ఈ విషయాలు ముఖ్యం
* ఏదైనా కొత్త ప్యాక్ అప్లై చేసే ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ (చెవి వెనుక లేదా మోచేతిపై) చేయడం మంచిది, ఎందుకంటే కొన్ని పదార్థాలకు మీకు అలెర్జీ ఉండవచ్చు.
* ఎల్లప్పుడూ స్వచ్చమైన చందనం పొడి వాడండి.
* మంచి ఫలితాల కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, తగినంత నీరు, నిద్ర, సన్ స్క్రీన్ అప్లై చేయడం పాటించడం చాలా ముఖ్యం.
* తీవ్రమైన చర్మ సమస్యలు ఉంటే ఈ ఫేస్ ప్యాక్స్ వాడే ముందు చర్మ నిపుణుడ్ని సంప్రదించడం చాలా ముఖ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa