హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. వెంకటరమణ ప్రైవేట్ బస్సుకు చెల్లూరు వద్ద ప్రమాదం జరిగింది. బస్సు వెనుక చక్రం డివైడర్ ఎక్కడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న విజయనగరం రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa