ఓట్ల చోరీ లాంటి ఆరోపణలతో ఎన్నికల సంఘం (ఈసీ) పై ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బిహార్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (Bihar Special Intensive Revision) పైన కూడా ప్రశ్నలు ప్రస్తావించబడుతున్నాయి.ఈ పరిణామాల మధ్య ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల వ్యవస్థను మరింత మెరుగుపరచడం, క్రమబద్ధీకరించడం లక్ష్యంగా గత ఆరు నెలల్లో 28 రకాల చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. మరణాల నమోదు డేటాను సమన్వయం చేయడం ద్వారా క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు మరణించిన ఓటర్ల గురించి సమయోచిత సమాచారం అందజేయబడుతుందని తెలిపారు.ఎన్నికల వ్యవస్థ బలోపేతం కోసం భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరిపి, ప్రక్షాళన చర్యలు చేపట్టడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడం, ఓటర్ల జాబితాలను సరిచేయడం మరియు ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడం వంటి విభాగాల్లో ఈసీ చర్యలు తీసుకున్నట్టు వెల్లడైంది. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కీలక సంస్కరణగా భావిస్తున్నారు. అర్హులందరికీ ఓటు హక్కులు కల్పించడం, అనర్హుల పేర్ల తొలగింపు ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఇటీవల ఎన్నికల సంఘం ఖండించింది. అన్ని పార్టీలతో సమానంగా వ్యవహరిస్తున్నామని, ఎలాంటి ప్రాధాన్యతలు లేవని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా నకిలీ ఓట్ల విషయాలు ప్రచారం చేయడాన్ని వారు అంగీకరించరన్నారు. ఓట్ల చోరీ ఆరోపణలపై రాహుల్ గాంధీ వారం రోజుల్లోపు అఫిడవిట్ సమర్పించాలని కోరారు. లేకపోతే, ఈ ఆరోపణలను నిరాధారంగా పరిగణించి చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa