ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే ఒక ఆసనం వేసి 20 రోజుల్లో 4.5 కేజీలు తగ్గిన యువతి

Life style |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 11:18 PM

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం నానా తంటాలు పడుతున్నారు. కొందరు జిమ్‌ల్లో చెమటలు చిందిస్తున్నారు. మరికొందరు డైట్ పేరుతో కడుపు మాడ్చుకుంటున్నారు. అయినా ఫలితం ఉండటం లేదు. అలాంటి వారికి ఒక ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. నిజానికి యోగా శరీరం, మనసుకు బలాన్ని ఇస్తుంది. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. యోగా శరీరాన్ని సరళంగా మారుస్తుంది. కండరాల్ని బలపర్చడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు తేల్చాయి.


అందుకే ఈ రోజుల్లో చాలా మంది యోగాపై ఆసక్తి చెబుతున్నారు. ఇక, చాలా మంది బరువు తగ్గడం కోసం యోగాని తమ జీవనశైలిలో చేర్చుకుంటున్నారు. అయితే, ఒకే ఒక యోగాసనంతో 20 రోజుల్లో 4.5 కిలోలు తగ్గినట్టు ఒక యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. జిమ్‌కు వెళ్లకుండా, ఎటువంటి భారీ వ్యాయామం చేయకుండా బరువు తగ్గినట్టు ఆమె తెలిపింది. ఇందుకు సూర్యనమస్కార యోగాసనమే కారణమని చెప్పింది. మరీ, సూర్యనమస్కారం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఎలా చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


సూర్య నమస్కారం


యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. వాటిలో సూర్య నమస్కారం ఒకటి. సూర్య సూర్య నమస్కారంలో మొత్తం 12 భంగిమలు ఉన్నాయి. ఈ 12 భంగిమలను సాధన చేయడం ద్వారా, శరీరంలోని ప్రతి భాగం చురుగ్గా మారుతుంది. ఫలితంగా, మొత్తం శరీరంలో శక్తి ప్రసరణ జరుగుతుంది. సూర్య నమస్కారాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా, బలంగా మారుతుంది. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సాయపడే గొప్ప వ్యాయామం.


సూర్య నమస్కారంలోని భంగిమల పేర్లు


* ప్రణామాసనం: ప్రార్థనా భంగిమ.


* హస్త ఉత్తనాసనం: చేతులు పైకి లేపి వెనుకకు వంగడం.


* హస్త పాదాసనం: ముందుకు వంగి పాదాలను తాకడం.


* అశ్వ సంచలనాసనం: ఒక కాలు వెనక్కి, మరొక కాలు ముందుకు చాచడం.


* దండాసనం: రెండు కాళ్లను వెనక్కి చాచి.. నేలపై చేతులు, పాదాలు ఉంచి.. శరీరాన్ని ఒక సరళరేఖలా ఉంచడం


* అష్టాంగ నమస్కారం: ఎనిమిది శరీర భాగాల సాయంతో శరీరాన్ని నేలపై ఆనించడం.


* భుజంగాసనం: పొట్ట మీద పడుకుని శరీరాన్ని పైకి లేపడం. (పాము పడగలా ఎత్తాలి)


* పర్వతాసనం: శరీరాన్ని V ఆకారంలో పైకి లేపడం. (అంటే మౌంటెన్ షేపులో ఉండాలి)


* అధోముఖ శ్వనాసనం: మరో కాలు వెనక్కి, ఇంకొక కాలు ముందుకు చాచడం.


* హస్త పాదాసనం: కుడి కాలును ముందుకు తెచ్చి చేతులతో పాదాలను తాకాలి.


* హస్త ఉత్తనాసనం: శ్వాస తీసుకుంటూ చేతులు పైకొద్ది కొద్దిగా వెనుకకి వంగడం


* ప్రణామాసనం: మళ్లీ ప్రార్థనా భంగిమ (నమస్కార ముద్ర)


** ఈ భంగిమల్ని వరుసగా చేయడం వల్ల సూర్య నమస్కారం పూర్తవుతుంది.


ఎలా చేయాలి?


ఇందులో మొత్తం 12 ఆసనాలు ఉన్నాయి. ప్రాణాయామం నుంచి ప్రారంభించి, అన్ని ఆసనాలను ఒక చక్రంగా పరిగణించాలి. అంటే, మొత్తం 12 చక్రాలు చేయాలి. అవన్నీ సరిగ్గా పూర్తి చేయడానికి కనీసం అరగంట పడుతుంది. అంటే, అరగంటలోపు.. ఇది మొత్తం శరీరంలోని అన్ని కండరాలకు కదలికను ఇస్తుంది. ఫలితంగా, చెమట ఎక్కువ పడుతుంది. చెమట రూపంలో శరీరం నుంచి కొవ్వు తొలిగిపోతుంది. కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి. సూర్య నమస్కారంతో త్వరగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.​


ఇతర ప్రయోజనాలు


* ప్రతి రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరం మొత్తం శక్తితో నిండిపోతుంది.


* సూర్య నమస్కారం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.


* రోజూ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.


* సూర్య నమస్కారం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మం, జుట్టుకు తగినంత పోషణ లభిస్తుంది.


* గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


* శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది.


* ప్రశాంత నిద్ర పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది.


ముఖ్యమైన విషయాలు


ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయండి. ఇది ముఖ్యంగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాలలో వశ్యతను పెంచుతుంది. ప్రతి ఆసనానికి కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఇవ్వడం మంచిది. వీటిలో ప్రాణాయామం, ధ్యానం కూడా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజూ అరగంట పాటు సూర్య నమస్కారంలోని భంగిమల్ని చేస్తే బరువు తగ్గడంతో పాటు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa