ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, NRIలు ఇప్పుడు భారతదేశంలో ఆరోగ్య భద్రతపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కేవలం తమ తల్లిదండ్రుల కోసం మాత్రమే కాదు, తమ స్వంత ఆరోగ్య రక్షణ కోసం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇప్పుడు ఒక ప్రధాన ట్రెండ్‌గా మారింది.విదేశాల్లో అధిక వైద్య ఖర్చులు, అక్కడ కవరేజ్ పరిమితులు, అలాగే భారత్‌లో మెరుగైన వైద్య సదుపాయాలు NRIలను భారతదేశంలో ఆరోగ్య భీమా తీసుకునేందుకు ప్రేరేపిస్తున్నాయి.2024లో భారత్‌కు 2.1 మిలియన్లకు పైగా మెడికల్ టూరిస్టులు వచ్చారు. వీరు కార్డియాక్ కేర్, క్యాన్సర్ చికిత్స వంటి విభాగాల వైద్య సేవలకు భారత్‌ని ఆశ్రయించారు. COVID అనంతరం ఈ సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తుంది. వీరిలో విదేశీయుల్లా కాకుండా అమెరికా, UK, UAE, సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయ NRIలు కూడా ఉన్నారు. అనేక మంది ఇప్పుడు కేవలం తల్లిదండ్రులకే కాక, తమ ఆరోగ్య భద్రత కోసం కూడా భారత్‌లో ఆరోగ్య బీమా కొనుగోలు చేస్తున్నారు.ఈ ప్రవర్తన కేవలం భావోద్వేగాలకోసం కాదు, ఆర్థిక ప్రయోజనాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ముందస్తు ప్రణాళికల వల్ల కూడా ఏర్పడింది.IRDAI మరియు పరిశ్రమ సమాచారం ప్రకారం, 2022 తరువాత NRIల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య 30-35% పెరిగినట్లు గమనించబడింది. పెద్దల సంరక్షణ ప్రధాన కారణంగా ఉండగా, వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకునే వారూ ఉన్నారు.విదేశాలలో ఆరోగ్య వ్యయాలు భారీగా పెరిగాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆరోగ్య ఖర్చు 10.1% పెరిగింది. US, UK, సింగపూర్ వంటి దేశాల్లో వైద్య ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. విదేశీ ఆరోగ్య బీమా ప్లాన్లు ఎక్కువగా ప్రీ-ఎగ్జిస్టింగ్ పరిస్థితులు, డయాగ్నస్టిక్స్, OPD ఖర్చులను కవర్ చేయవు.కాబట్టి, NRIలు ఇప్పుడు హార్ట్ సంబంధిత సమస్యలతోపాటు తమ ఆరోగ్యానికి కూడా భారత్‌లో భీమా తీసుకోవడం ఆర్థికంగా మేలు అని భావిస్తున్నారు.భారతదేశంలో ఆరోగ్య సేవలు కేవలం చవకైనవి కాకుండా, ప్రపంచ స్థాయిలో నాణ్యత గల సాంకేతికతతో అందుబాటులో ఉన్నాయి. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం, భారత ఆరోగ్య రంగం 2030 నాటికి రూ. 48 లక్షల కోట్ల (~$600 బిలియన్స్) మార్కెట్‌కి పెరుగుతుంది. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో JCI మరియు NABH సర్టిఫైడ్ హాస్పిటల్స్ ఉన్నాయి.కోవిడ్ తర్వాత టెలిమెడిసిన్ వాడకం మూడు రెట్లు పెరిగింది. eసంజీవని ద్వారా 10 కోట్లకు పైగా ఆరోగ్య కన్సల్టేషన్లు జరిగాయి. అలాగే, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 45 కోట్ల మంది డిజిటల్ హెల్త్ రికార్డ్స్‌లో నమోదు అయ్యారు, ఇవి ఇంటర్-ఆపరబుల్ విధంగా పనిచేస్తున్నాయి. ఈ మౌలిక సదుపాయాలు NRIలకు కూడా తాత్కాలికంగా భారతదేశంలో ఉన్నప్పుడు ఆరోగ్య భద్రతను మెరుగుపరిచాయి.2024-25 సగటు వైద్య ఖర్చుల సరిపోలిక చూస్తే, NRIలకు భారత్‌లో ట్రీట్మెంట్ చాలా లాభదాయకమని స్పష్టమవుతుంది. ఉదాహరణకు, MRI స్కాన్ US, UK, సింగపూర్‌లో రూ. 45,000-60,000 ఖర్చవుతుందంటే, భారత్‌లో కేవలం రూ. 3,000-5,000లో ఇది జరుగుతుంది. కీ జాయింట్ రీప్లేస్ సర్జరీ US/UK/సింగపూర్‌లో రూ.18-22 లక్షల వరకు ఉంటే, భారత్‌లో ఇది రూ.2.5-3.5 లక్షల్లో పూర్తి అవుతుంది. కార్డియాక్ బైపాస్ సర్జరీ US/UK/సింగపూర్‌లో రూ.20-30 లక్షల వరకు ఖర్చవుతుందా, భారత్‌లో రూ.2-4 లక్షల పరిధిలోనే ఉంటుంది. కీమోథెరపీ సైకిల్‌కి US/UK/సింగపూర్‌లో రూ.2.5-3.5 లక్షలు ఖర్చవుతుంటే, భారత్‌లో రూ.30,000-70,000లో చికిత్స అందుబాటులో ఉంది. OPD కన్సల్టేషన్ కూడా విదేశాల్లో రూ.5,000-10,000 కాగా, భారత్‌లో కేవలం రూ.400-900లో జరుగుతుంది. ఈ తేడా NRIలు తమ ఆరోగ్యాన్ని భద్రంగా, తక్కువ ఖర్చుతో భారత్‌లో సంరక్షించుకోవడానికి కారణమని సూచిస్తుంది.చాలా NRIలు ఇప్పటికే గ్లోబల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, లేదా ఎమ్ప్లాయర్ గ్రూప్ కవరేజ్ ద్వారా భారత్‌లో కూడా పరిమితమైన రక్షణ పొందుతున్నారని భావిస్తారు. కానీ వాస్తవం ఇలా కాదు. ట్రావెల్ ఇన్సూరెన్స్ సాధారణంగా ప్రీ-ఎగ్జిస్టింగ్ పరిస్థితులు, డయాగ్నోస్టిక్స్, రూటీన్ OPD కవరేజ్ ఇవ్వదు. అలాగే, ఎమ్ప్లాయర్ ప్రొవైడ్ చేసిన హెల్త్ ప్లాన్లు ఎక్కువగా ఇతర దేశాలకు పరిమితం కావడంతో భారత్‌లో ట్రీట్మెంట్ claims అంగీకరించకపోవచ్చు. అందుకే NRIలకు భారత్‌లో సంపూర్ణ ఆరోగ్య భీమా అవసరం అవుతుంది.ఈ విధంగా, NRIల ఆరోగ్య భీమా కేవలం భారతదేశంలో చికిత్స కోసం మాత్రమే కాకుండా భవిష్యత్ రక్షణ కోసం కూడా ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. వారు ఇప్పటికే ఉన్న గ్లోబల్ కవరేజీతో పాటు, భారత్‌లో కూడా పూర్తి భీమా సౌకర్యం పొందగలుగుతున్నారు. భారతీయులకు ఆరోగ్య భీమా ప్రయాణ భద్రత మాత్రమే కాక, అంతర్జాతీయ ఆరోగ్య రక్షణలో బలమైన పాయింట్‌గా మారిపోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa