తూర్పుగోదావరి జిల్లా రేవ్ పార్టీ కలకలం రేగింది. నల్లజర్ల మండలం ఘంటవారిగూడెంలో బర్త్ డే వేడుకల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి 23 మంది యువకులను, ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 26 మందిపై కేసు నమోదు చేసి, పలు కార్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రాజకీయ నేత పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa