కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్‌లో ప్రారంభం కానుంది. ఏడేళ్ల తర్వాత వైజాగ్‌కు తిరిగి వస్తున్న ఈ లీగ్, జాతీయ క్రీడా దినోత్సవం రోజున మొదలవడం విశేషం. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది. అదే రోజు బెంగళూరు బుల్స్, పుణెరి పల్టాన్ జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ వినూత్న మార్పులతో అభిమానులను అలరించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa