అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘భయంకరమైన విషాదం సంభవిస్తే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం’’ అని ప్రకటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల నడుమ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని వాన్స్ స్పష్టం చేశారు. అయినా అనుకోని పరిణామాలు సంభవిస్తే తాను ముందుకు రావడానికి సిద్ధమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa