ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ మరో శుభవార్త.. ఆదేశాలు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 07:41 PM

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు కల్పించారు. ఒకేసారి 211 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి.. ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. 53 మంది ఎంపీడీవోలకు డీఎల్‌డీవోలుగా ప్రమోషన్ వచ్చింది. మరో 158 మంది డిప్యూటీ ఎంపీడీవోలుగా, జిల్లా పరిషత్, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లో పరిపాలనా అధికారులుగా పదోన్నతులు పొందారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఆనందం నింపింది. ప్రమోషన్ల విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. ఏపీ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు, ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమోషన్లు కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ సీఎం ఓఎస్డీ వెంకట కృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుమన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు. 53 మంది ఎంపీడీవోలకు డీఎల్‌డీవోలుగా పదోన్నతులు కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలకు, ఆకాంక్సలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నతాధికారులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు మేలు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.


ఏపీలో జర్నలిస్టులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మరో మూడు నెలల పాటూ అక్రెడిటేషన్‌ కార్డుల కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది. తాజా నిర్ణయంతో ఆగస్టు 31తో ముగియనున్న అక్రెడిటేషన్ కార్డు గడువు నవంబర్‌ 30 వరకు పొడిగించారు. ప్రభుత్వం కనుక ఈ మూడు నెలలలోపు కొత్త అక్రెడిటేషన్‌ కార్డులు జారీ చేస్తే.. ఈ పొడిగింపు ఉత్తర్వులు అప్పటి వరకే పరిమితమవుతాయి. ఈ మేరకు పౌర సంబంధాల శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. అయతే జర్నలిస్టులు మాత్రం తమకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని కొద్ది రోజులుగా కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa