ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రెస్ లూజ్ ,,,,సరైన ఫిట్టింగ్ ఉండేలా ఏం చేయాలంటే

Life style |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 08:56 PM

ఎక్కువ డబ్బు పెడితే డ్రెస్సెస్ బాగుంటాయని కొందరు అనుకుంటారు. కానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఏ డ్రెస్ అయినా సరే ఫిట్టింగ్ బాగుంటేనే దానికి లుక్ వస్తుంది. అందుకే, సరైన సైజెస్‌లో డ్రెస్సెస్ తీసుకుంటారు. అయితే, ఈ సైజెస్ కూడా అన్నీ బ్రాండ్స్‌లో ఒకేలా ఉండవు. కొన్ని బ్రాండ్స్ సరైన విధంగా ఉంటే మరికొన్ని బ్రాండ్స్ టైట్‌గా మారతాయి. కాబట్టి, మనం తీసుకునేటప్పుడు చెక్ చేసుకుని తీసుకోవాలి. అలా లేకపోతే ఇంటికి వచ్చాక దానిని సరైన విధంగా ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. అంత టైమ్ లేదనుకోండి. కొన్ని హ్యాక్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే బయటికి వెళ్లకుండానే లూజ్ డ్రెస్సెస్‌ని టైట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవారికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. మరి ఆ హ్యాక్స్ ఏంటో తెలుసుకోండి.


లేస్ కట్టడం


మనకి ఇప్పుడు చాలా లేస్‌ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని పై నుంచి బెల్ట్‌లా టై చేయండి. లేస్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే షూ లేస్ కూడా యూజ్ చేయొచ్చు. కట్టాక డ్రైస్‌ని కాస్తా పుల్ చేయండి. దీంతో అదో డిజైన్‌లా కనిపిస్తుంది. చక్కగా లూజ్ డ్రెస్‌ని టైట్‌గా కనిపించేలా చేయొచ్చు. ఇన్‌స్టంట్‌గా డ్రెస్ కుట్టకుండానే మంచి టైట్ లుక్‌ని ఇస్తుంది.


పిన్స్


బయటి నుంచి డ్రెస్‌పై లేస్ కట్టడం ఇష్టం లేకపోతే డ్రెస్‌ని లోపల నుంచి రెండువైపులా పిన్స్ పెట్టేయండి. ఇందులో నుంచి లేస్ తీయండి. మీ సైజ్ ప్రకారం దీనిని కట్టుకోండి. ఇది ఉల్టా వేసుకుని కూడా చేయొచ్చు. అలా అయితే, సరైన ఫిట్టింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత డ్రెస్ స్ట్రెయిట్ చేసి వేసుకోండి. దీంతో మీకు చూడ్డానికి డ్రెస్ లూజ్‌గా అనిపించదు. హ్యాపీగా కుట్లు లేకుండానే డ్రెస్‌ని టైట్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్‌ని వాడకుండా పక్కకి పెట్టకుండా ఇలా హ్యాపీగా వాడుకోవచ్చు.


బ్యాంగిల్


ఇది కూడా మంచి హ్యాక్. దీనికోసం ఓ బ్యాంగిల్ తీసుకోండి. లోపల సెంటర్‌లో పెట్టేయండి. దాని చుట్టూ రబ్బర్ బ్యాండ్‌తో సెక్యూర్ చేయండి. ఇది బయటికి చూడ్డానికి మంచి డిజైన్‌లా కనిపిస్తుంది. టీ షర్ట్స్, కుర్తీస్, బనియన్ క్లాత్స్‌కి చాలా బాగుంటుంది. బయటికి చూడ్డానికి చాలా క్రియేటివ్‌గా అనిపిస్తుంది.


సూట్ అయ్యే బెల్ట్


లూజ్ డ్రెస్సెస్‌పైకి మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ బెల్ట్ కూడా మంచి లుక్‌ని ఇస్తుంది. దీనికోసం మీరు ఏ కలర్ బెల్ట్ అయినా వేసుకోండి. దాంతో డ్రెస్ లుక్ మారిపోతుంది. ఇవి ట్రెండీ డ్రెస్సెస్‌పైకి చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ వాటిపైకి అలాంటి గోల్డ్ చైన్స్ వంటివి ఉంటే పెయిర్ చేయొచ్చు.


కుట్లు వేయించేటప్పుడు


అయితే, డ్రెస్ కుట్లు వేయించేటప్పుడు కూడా సరైన టిప్స్ ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా సరే క్లాత్ ఓ సారి ఉతికిన తర్వాతే కుట్లు వేయించాలి. దీంతో డ్రెస్ టైట్ కాకుండా ఉంటుంది. మరీ టైట్‌గా కాకుండా కొద్దిగా లూజ్ ఉండేలా చూడండి. అప్పుడు మీరు వేసుకోవడానికి స్టైల్ చేయడానికి బాగుంటుంది. దీంతో పాటు డ్రెస్ క్లాత్ కొద్దిగా తీసుకుని ఓ బెల్ట్‌లా కుట్టించుకోవచ్చు. దీనిని స్టైల్ చేస్తే డ్రెస్ ఫ్యాషన్‌గా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa