బెల్లం తింటే ఆరోగ్యానికి మంచిదని తెలియగానే ఇష్టంగా తింటుంటాం. కానీ, మనం తినే విధానాన్ని బట్టి కూడా మనకి వచ్చే చాలా సమస్యల్ని దూరం చేస్తుంది బెల్లం. దీనిని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగ్గా మారడం దగ్గర్నుంచీ సంతానోత్పత్తి, బలమైన ఎముకలు, ఇతర లాభాలు ఎన్నో ఉన్నాయి. అయితే, అది ఊరికే తింటే కాదు. కొన్ని కాంబినేషన్స్‌తో తింటేనే ఈ లాభాలు ఉంటాయి. దీని గురించే న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ కొన్ని కాంబినేషన్స్‌ని సజెస్ట్ చేస్తున్నారు. మనం బెల్లాన్ని కొన్ని ఫుడ్స్‌తో కలిపి తీసుకున్నప్పుడు అవి ఆటోమేటిగ్గా చాలా బెనిఫిట్స్‌ని అందిస్తుంది. అదెలానో తెలుసుకోండి.
నోటి దుర్వాసన, నోటి శుభ్రత
కొంతమంది మాట్లాడుతుంటే అదో రకమైన వాసన వస్తుంటుంది. నోరు కూడా శుభ్రంగా ఉండదు. అలాంటి వారు సోంపుతో బెల్లాన్ని కలిపి తీసుకోండి. దీంతో నోటి దుర్వాసన ఉండదు. ప్లాక్ తగ్గుతుంది. ఇదో మౌత్ ఫ్రెషనర్‌లా పనిచేస్తుందంటే ఆశ్చర్యం లేదు. రెగ్యులర్‌గా తీసుకుంటే తేడా మీకే తెలుస్తుంది. నోటి దుర్వాసనకి నేచురల్‌గా చెక్ పెట్టాలంటే సోంపుతో బెల్లాన్ని కలిపి తీసుకోండి.
ఎముకల బలానికి గోండ్‌తో
బెల్లాన్ని తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి. పాలిచ్చే తల్లులకి ఈ బెల్లం ఎంతగానో మేలు చేస్తుంది. ఎదిగే పిల్లలకి, వృద్ధులకి బెల్లాన్ని తినిపించడం చాలా ముఖ్యం. దీని కోసం గోండ్‌ని బెల్లంతో కలిపి తీసుకోవాలి. దీని వల్ల బాడీలో వేడి కూడా తగ్గుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తినడం అలవాటు చేసుకోండి.
మలబద్ధకానికి
మలబద్ధకంతో బాధపడేవారు నేచురల్‌గానే ఆ సమస్యని దూరం చేసుకునేందుకు బెల్లాన్ని డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. దీనిని నెయ్యితో కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి బయటపడొచ్చు.ఓ టీస్పూన్ బెల్లాన్ని అంతే పరిమాణంలో బెల్లంతో కలిపి తీసుకోండి. దీంతో చాలా వరకూ మలబద్ధకం దూరమవుతుంది. ఎలాంటి మందులు వాడకుండానే ఇది మీకు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి, హ్యాపీగా ఈ నేచురల్ టిప్‌ని ఫాలో అవ్వండి.
పీరియడ్స్ పెయిన్
ఆడవారు నెలనెలా ఎదుర్కొనే సమస్యల్లో పీరియడ్స్ కూడా ఒకటి. ఈ టైమ్ అందరికీ ఒకేలా ఉండదు. కొందరికీ ఎలాంటి పెయిన్స్, ఇబ్బంది లేకుండా ఉంటే మరికొంతమందికి విపరీతమైన కడుపునొప్పి, క్రాంప్స్ వంటి సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు బెల్లాన్ని తీసుకుంటే సమస్యని కంట్రోల్ చేయొచ్చు. ఆ బెల్లాన్ని కూడా ధనియాలతో కలిపి తీసుకోండి. దీంతో పీరియడ్స్ నొప్పి తగ్గడమే కాకుండా ఓవర్ బ్లీడింగ్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా సరే నెలసరి రాకుండా ఇబ్బంది పడుతుంటే బెల్లం, ధనియాలని ట్రై చేయండి.
ఇమ్యూనిటీ పెరిగి జలుబు, జ్వరం దూరమవ్వాలంటే
ఇమ్యూనిటీ తగ్గితేనే జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. ఆ సమస్యల్ని దూరం చేసేందుకు పసుపుతో బెల్లాన్నికలిపి తీసుకోవాలి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. శొంఠితో కలిపి తీసుకుంటే జ్వరం త్వరగా తగ్గుతుంది. బాడీలో మంట కూడా దూరమవుతుంది. నువ్వులతో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం వంటివి దూరమవుతాయి.
బెల్లం తింటే లాభాలు
జుట్టు, చర్మానికి
ఆరోగ్యకరమైన అందమైన జుట్టు కావాలని అందరికీ ఉంటుంది. దానికోసం మన డైట్ హెల్దీగా ఉంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాంటి వారు మెంతుల్ని డైట్‌లో యాడ్ చేసుకోవడం మంచిదే. అయితే, మెంతులు నేరుగా తినడం కష్టం. కాబట్టి, కాస్తా బెల్లాన్ని కలిపి తినండి. దీని వల్ల మరో లాభమేంటంటే ఐరన్ లోపం కారణంగానే జుట్టు రాలిపోయే సమస్యకి ఈ కాంబినేషన్ చెక్ పెడుతుంది. దీనిని తినడం వల్ల దృఢమైన అందమైన నల్లని జుట్టు మీ సొంతమవుతుంది. అలివ్ సీడ్స్ దొరుకుతాయి. వీటితో బెల్లాన్ని కలిపి తీసుకుంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్‌కి హెల్ప్ అవుతుంది. పిగ్మంటేషన్ తగ్గుతుంది. అంతేకాకుండా, జుట్టు పెరుగుదలకి కూడా మంచిది.
ఆకలి తగ్గి బలంగా మారేందుకు
వేరుశనగలతో బెల్లాన్ని కలిపి తీసుకుంటే అప్పటికప్పుడు క్రేవింగ్స్ తగ్గుతాయి. అంతేకాకుండా, ప్రోటీన్ బార్‌లా పనిచేసి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ అందుతుంది. ఆకలి కంట్రోల్ అవుతుంది. అందుకే, మీరు ఎప్పుడైనా పల్లిపట్టి తిన్నప్పుడు ఆ రిజల్ట్‌ని గమనించే ఉంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa