వర్షాకాలంలో అనేక సమస్యలు వస్తాయి. ఈ సీజన్‌లో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో తలపై చర్మం చాలా జిడ్డుగా మారి మురికి పేరుకుపోతుంది. దీంతో, చుండ్రు ఒక సాధారణ సమస్యగా మారుతుంది. ఇది దురద, చికాకు కలిగించడమే కాకుండా.. జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. దీంతో జుట్టు రాలడం సమస్య కూడా ప్రారంభమవుతుంది. చుండ్రు జుట్టు అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. దురద, చికాకు సమస్యల్ని కూడా కలిగిస్తాయి. చుండ్రును వదిలించుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే షాంపూలు, రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినా ఫలితం ఉండదు. ఇలాంటి వారి కోసం ప్రముఖ హెయిర్ స్టైలిష్ట్ జావేద్ హాబీబ్ ఓ చిట్కా చెప్పారు. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చుండ్రు ఎందుకు వస్తుంది?
* చుండ్రుకు ప్రధాన కారణం తలపై ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్. దీంతో పాటు తలపై చర్మం అధికంగా పొడిబారడం, జిడ్డుగల తల, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, పోషకాహార లోపం, జుట్టు మురికిగా ఉండటం లేదా రసాయనాలు కలిగిన జుట్టు ఉత్పత్తులను తరచుగా ఉపయోగించడం వల్ల కూడా చుండ్రు వస్తుంది.
* తల చర్మం పొడిగా మారడం వల్ల మృతకణాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
* ఈస్ట్ తలపై పెరగడం ప్రారంభమైతే.. అప్పుడు కూడా చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉంది.
* తామర లేదా సోరియాసిస్: ఈ చర్మ వ్యాధులు కూడా చుండ్రుకు కారణమవుతాయి.
జావేద్ హాబీబ్ చెప్పిన చిట్కా
ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రుకు అత్యంత ప్రభావవంతమైన నివారణ అని జావేద్ హబీబ్ చెప్పారు. జావేద్ హబీబ్ ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తలను శుభ్రపర్చడంలో సాయపడతాయి. అంతేకాకుండా జుట్టులో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా తలను బాగా శుభ్రపరుస్తుంది. తలపై దురద, చికాకు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టుకు అనేక ప్రయోజనాల్ని ఇస్తుందని ఆయన చెప్పారు.
జావేద్ హాబీబ్ ఏం చెప్పారంటే
చుండ్రు తగ్గేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా అప్లై చేయాలి?
జుట్టుకు ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేయడం చాలా సులభం. ఇందుకోసం మీరు తలస్నానం కోసం షాంపూ ఉపయోగించేటప్పుడు.. ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేయాలి. అంటే.. షాంపూలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలపి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయండి. తలని బాగా శుభ్రం చేసి.. జుట్టును షాంపూతో వాష్ చేసుకోండి. మీరు వారానికి రెండు సార్లు షాంపూతో తలస్నానం చేస్తుంటే.. ఒకసారి ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి వాడండి. దీని వల్ల చుండ్రు తగ్గడంతో పాటు మెరుగైన ఫలితాలుంటాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేయడం వల్ల లాభాలు
* చుండ్రును శుభ్రపరచడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV) చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
* ఇది తల యొక్క pH ని సమతుల్యం చేస్తుంది. చుండ్రు సమస్యను నివారించడంలో సాయపడుతుంది.
* తలపై ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేసినప్పుడు, అది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది, దీనివల్ల చుండ్రు సమస్య మళ్లీ మళ్లీ రాదు.
* అంతేకాకుండా తల, జుట్టులో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. దీని కారణంగా చుండ్రు సమస్య తగ్గుతుంది.
చుండ్రుకు ఇతర చిట్కాలు
* కొబ్బరి నూనె: కొబ్బరి నూనె తలకు తేమను అందిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. ఇందుకోసం కొద్దిగా గోరువెచ్చని కొబ్బరి నూనెను తలకు పట్టించి కొన్ని గంటలు అలాగే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో కడిగేయండి.
* పెరుగు: పెరుగులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చుండ్రును తగ్గించడంలో సాయపడుతుంది. పెరుగును తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత వాష్ చేసుకోండి.
* నిమ్మరసం: నిమ్మరసం తలని శుభ్రపరుస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. నిమ్మరసాన్ని నీటితో కలిపి తలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
* కలబంద: కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సాయపడతాయి. కలబంద జెల్‌ను తలకు రాసుకుని 30 నిమిషాల తర్వాత కడిగేయండి.
* శనగపిండి: శనగపిండి తలపై చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. శనగపిండిని పెరుగు లేదా నీటితో కలిపి పేస్టులా చేసి తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa