విశాఖపట్నం జిల్లాలోని మారికవలస కొమ్మదిలో సీ ఫుడ్స్ కంపెనీలు కలుషిత నీటిని నేరుగా మారికవలస-కాపులుప్పాడ గెడ్డలోకి వదలడంతో ఆ ప్రాంతం తీవ్ర కాలుష్యానికి గురై దుర్వాసన వెదజల్లుతోంది. ఈ కాలుష్యం వల్ల సమీపంలోని పంట పొలాలు నాశనమవుతున్నాయి. అంతేకాకుండా, సముద్రంలో చేపలు, తాబేలు వంటి జీవులు చనిపోతున్నాయని స్థానికులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa