ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షాపింగ్ ప్రియుల అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 మళ్లీ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రైమ్ మెంబర్స్కి ఆఫర్లు 24 గంటల ముందుగానే అందుబాటులో ఉండనున్నాయి.అయితే, సేల్ ఖచ్చితమైన తేదీలు ఇంకా వెల్లడికాలేదు. అయినప్పటికీ అమెజాన్ ముందుగానే డీల్స్, డిస్కౌంట్స్, ఆఫర్లను టీజ్ చేస్తూ కస్టమర్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
*డీల్స్ & బ్యాంక్ ఆఫర్లు: SBI క్రెడిట్, డెబిట్ కార్డులు (EMIతో సహా) ఉపయోగించే కస్టమర్లకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అదనంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉండనున్నాయి. ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ & కిచెన్ ఉత్పత్తులపై కూడా 50% నుండి 80% వరకు అద్భుతమైన ఆఫర్లు లభిస్తాయి.ఎలక్ట్రానిక్స్ & ఆక్సెసరీస్: ఈ కేటగిరీలో AMD Ryzen 5 7520Uతో ASUS Vivobook Go 14, AMD Ryzen 7 7730Uతో Dell New 15, NVIDIA GeForce RTX 3050తో ASUS TUF Gaming A15, అలాగే NVIDIA RTX 4060 గ్రాఫిక్స్‌తో HP Omen వంటి ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉంటాయి. అదనంగా Sony BRAVIA K-55S25B, LG UA82 సిరీస్ స్మార్ట్ టీవీలపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉంటాయి.గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 దాదాపు ప్రతి షాపింగ్ కేటగిరీని కవర్ చేస్తుందని, ఈ ఏడాది అమెజాన్ నిర్వహించే అతి పెద్ద ఈవెంట్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా, ఈసారి విమానాలు, హోటళ్లు, బస్సు టికెట్ల బుకింగ్‌లపై కూడా 65% వరకు తగ్గింపు లభించనుంది – అదనపు ఛార్జీలు లేకుండా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa