ప్రతి ఒక్కరూ మచ్చల్లేని అందమైన ముఖాన్ని కోరుకుంటారు. అయితే, ఈ రోజుల్లో జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా మొటిమలు, మచ్చల సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన చర్మానికి సరైన సంరక్షణ చాలా ముఖ్యం. చాలా మంది మచ్చలు, మొటిమలు, రంధ్రాలు (ఓపెన్ పోర్స్) తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటి వల్ల ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. అయితే, కొన్ని ఆయుర్వేద చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఆయుర్వేద పోషకాహార నిపుణురాలు శ్వేతా షా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక సులభమైన చిట్కా షేర్ చేశారు. టమాటాతో ఎలా మొటిమల వల్ల ఓపెన్ అయిన రంధ్రాల్ని ఎలా బిగించి.. అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చ తెలిపారు. సాధారణంగా టమాటా ఆహార రుచిని పెంచడమే కాకుండా, చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖం మీద టమాటాని ఎలా అప్లై చేయాలి, ప్రయోజనాలేంటో ఆమె షేర్ చేశారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటాతో అందం
న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ప్రకారం టమాటాలో విటమిన్ సి, లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు చర్మాన్ని టానింగ్ నుంచి రక్షిస్తాయి. చర్మ రంధ్రాలను తగ్గిస్తాయి. ముఖంపై అధిక జిడ్డును నియంత్రిస్తుంది. జిడ్డుగల చర్మం ఉన్నవారికి టమాటా రసం మంచి ఆప్షన్. అంతేకాకుండా మొటిమలతో బాధపడేవారికి టమాటా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని సహజంగా ప్రకాశవంతంగా చేస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. న్యూట్రిషనిస్ట్ ప్రకారం టమాటా ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
అప్లై చేసే విధానం
* ముందుగా తాజా టమాటాని తీసుకోండి. టమాటాని మిక్సీలో వేసి రసంలా తీయండి.
* ఈ రసాన్ని తీసుకువెళ్లి ఐస్ ట్రేలో క్యూబ్స్ స్థానంలో పోయండి. అలాగే కొన్ని గంటలు ఫ్రీజర్‌లో ఉంచండి.
* ఐస్ క్యూబ్స్‌లా టమాటా రసం క్యూబ్స్ రెడీ అయినట్టే.
* టమాటా జ్యూస్ క్యూబ్స్ తీసుకుని ముఖంపై సర్క్యూలర్ షేపులో సున్నితంగా మసాజ్ చేయండి.
* కాసేపు మసాజ్ చేసి.. ఆ తర్వాత శుభ్రమైన చన్నీటితో ముఖాన్ని వాష్ చేసుకోండి.
న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ఏం చెప్పారంటే
టమాటా క్యూబ్స్ అప్లై చేయడం వల్ల లాభాలు
టమాటా క్యూబ్స్‌ని ఈ విధంగా ఉపయోగించడం వల్ల చర్మం చల్లబడుతుంది. ముఖంపై తెరుచుకున్న రంధ్రాలు బిగుతుగా మారతాయి. ఇలా అప్లై చేయడం వల్ల ముఖంపై రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల చర్మం తక్షణమే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ చిట్కా అమలు చేయడం చాలు సులువు. వారానికి రెండు నుంచి మూడు సార్లు అప్లై చేయడం మంచి ఫలితాలు కనిపిస్తాయని శ్వేతా షా అంటున్నారు. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ చిట్కాతో పాటు శ్వేతా షా మరికొన్ని క్యూబ్స్ ట్రిక్ కూడా చెప్పారు. అవేంటంటే
బొప్పాయి క్యూబ్స్
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొప్పాయి.. చర్మ సంరక్షణలో సాయపడుతుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు చనిపోయిన చర్మాన్ని తొలగిస్తాయి, మచ్చలను తగ్గిస్తాయి. చర్మపు రంగు మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం బొప్పాయి రసాన్ని తీసి ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేయండి. కొన్ని గంటల తర్వాత బొప్పాయి క్యూబ్స్ రెడీ. వీటితో మీ ముఖానికి మసాజ్ చేయవచ్చు. దీంతో ముఖంలో గ్లో వస్తుంది.
ఈ క్యూబ్స్ కూడా సాయపడతాయి
* పుదీనా, కొత్తిమీర, కరివేపాకు చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. మొటిమల్ని తగ్గించి.. చర్మానికి కొత్త అందాన్ని ఇస్తాయని శ్వేతా షా అంటున్నారు. ఈ మూడింటినీ కలిపి గ్రైండ్ చేసి ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేసి ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు.
* కుంకుమపువ్వు, పచ్చి పాలు కలిపి వాడటం వల్ల పిగ్మెంటేషన్ తగ్గి ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. మీరు ఈ రెండింటి నుంచి ఐస్ క్యూబ్స్ తయారు చేసి చర్మ సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు.
* శ్వేతా షా ప్రకారం ఈ నివారణలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముఖంపై ఓపెన్ అయిన రంధ్రాల్ని బిగించి తక్షణ మెరుపును ఇస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa