మన బాడీలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. బ్రెయిన్ నుంచి లివర్ వరకూ ప్రతీ అవయవం పనిచేయడానికి నీరు అవసరం. నీరు తీసుకోవడం వల్ల బాడీలోని ట్యాక్సిన్స్ మూత్రం ద్వారా వెల్లిపోతాయి. నీరు తక్కువగా తీసుకుంటే సరిగ్గా మూత్రవిసర్జన జరగదు. తక్కువ మూత్ర విసర్జన మూత్రపిండాల పనితీరుని తగ్గించడమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్స్‌కి దారి తీస్తుంది. కాబట్టి, పుష్కలంగా నీరు తాగాలి. కేవలం నీరు మాత్రమే తాగడం ఇష్టం లేని వారు హైడ్రేషన్ కోసం ఇతర డ్రింక్స్‌ని కూడా తీసుకోవచ్చు. దీని వల్ల బాడీలోని అదనపు వ్యర్థ పదార్థాలు సరిగ్గా బయటికి వెళ్లిపోతాయి. ఇది మూత్రపిండాలకి చాలా ముఖ్యం. కిడ్నీలు సరిగ్గా పనిచేయడానికి నీరు మాత్రమే కాకుండా ఏమేం తాగొచ్చో తెలుసుకోండి.
తులసి
భారతీయ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న తులసి కూడా నేచురల్‌గా మూత్ర విసర్జనగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీల పనితీరు మెరుగ్గా మారుతుంది. దీనిని తీసుకుంటే ముఖ్యంగా రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. మూత్ర పిండాల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎసెన్షియల్ ఆయిల్స్, ఎసిటిక్ యాసిడ్ వంటి పదార్థాలు మూత్రపిండాల్లోని రాళ్ళని కరిగిస్తాయి. దీనికోసం తులసిని నీటిలో మరిగించి తీసుకోవచ్చు. నేరుగా అయినా నమిలి తినొచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ కిడ్నీల సమస్యల్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇది బాడీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలని బ్యాలెన్స్ చేస్తుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల కిడ్నీల్లో రాళ్ళు కరిగిపోతాయి. దీనిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల నుండి టాక్సిన్స్ కూడా బయటికెళ్లిపోతాయి. ఎలా తీసుకోవాలంటే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ని కలిపి రోజూ ఉదయాన్నే తాగండి.
క్రాన్బెర్రీ జ్యూస్
క్రాన్బెర్రీ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మీ బాడీలో మంటను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఈ జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది. ఇది బ్యాక్టీరియాని మూత్రనాళానికి అంటుకోకుండా చేస్తాయి. ఈ జ్యూస్ తాగడం మీ డకి్నీలకు చాలా మంచిది. ఎందుకంటే ఇది పైలోనెఫ్రిటిస్‌ని నివారిస్తుంది. అయితే, మీరు లో షుగర్ జ్యూస్ లేదా అసలు తియ్యగా లేని జ్యూస్‌ని తీసుకోవడం మంచిది. దీని వల్ల మీ మూత్రపిండాలకి ఎలాంటి హాని జరగదు.
నిమ్మరసం, పసుపు
నిమ్మరసంతో రోజుని ప్రారంభించడం చాలా ముఖ్యం. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా బాడీలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. నిమ్మరసంలో కొద్దిగా పసుపు కలిపితే అందులోని కుర్కుమిన్ అనే కాంపౌండ్‌తో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కిడ్నీలను డీటాక్స్ చేస్తాయి. చాలా మందికి ఉదయాన్నే నిమ్మరసం తాగే అలవాటు ఉంటుంది. వారికి కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటుంది. అయితే, కొంతమందికి ఈ డ్రింక్ పడకపోవచ్చు. వారు ఇతర డ్రింక్స్‌ని తీసుకోవచ్చు.
దానిమ్మరసం
దానిమ్మరసం, గింజల్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. పొటాషియం మూత్రంలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. దీని ఆస్ట్రిజెంట్ గుణాల కారణంగా రాళ్ళు ఏర్పడవు. ఖనిజాలా స్పటికీకరణని తగ్గిస్తుంది. మూత్రపిండాల నుండి టాక్సిన్స్, వ్యర్థాలను బయటికి పంపుతుంది. అయితే, ఇప్పుడు చెప్పిన డ్రింక్స్ అన్నీ కూడా పంచదార లేకుండానే తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు రావు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa