AP: కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ విష ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని హోంమంత్రి అనిత విమర్శించారు. 'యూరియా పేరిట రూ.200 కోట్ల స్కాం' అంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఆమె స్పందించారు. ఈ మేరకు గురువారం 'ఎక్స్' వేదికగా ఆమె పోస్టు పెట్టారు. వైసీపీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆమె సవాల్ చేశారు. ఆధారాలు చూపలేకపోతే క్రిమినల్, సివిల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa