దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకువచ్చేందుకు విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామని స్థానిక ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని వెల్లడించారు. ఆదివారం పోరంకిలో విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. దేశమంతా ఈ ఉత్సవాలను చూపించాలనే ఉద్దేశ్యంతో విజయవాడ ఉత్సవ్‌ను చేపడుతున్నట్లు వివరించారు.ఇది ప్రజల సహకారంతో.. ప్రజల కోసం జరిగే కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవ్ ద్వారా వ్యాపార రంగంతో సహా మిగిలిన అన్ని రంగాలు మరింత అభివృద్ది జరిగేందుకు దోహదపడుతుందని ఎంపీ కేశినేని చిన్ని అభిప్రాయపడ్డారు. విజయవాడ అంటే వైబ్రెంట్ నగరమని అభివర్ణించారు. ఇక్కడ నుంచి వెళ్లిన వ్యక్తులు లక్షల ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa