సీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ – ప్రభుత్వం డీఏ బకాయిల విడుదల
సీసీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వంవైపు నుంచి శుభవార్త వెలువడింది. ఓ వెలుగు పట్టినట్లుగా, ఆరు విడతల్లో డీఏ బకాయిలను చెల్లించాలన్న నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.ఈ మేరకు తొలి విడతగా ఒక్కో ఉద్యోగి ఖాతాలో సుమారు రూ.70,000 వరకు జమ అయింది. ఈ అభివృద్ధితో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.డీఏ బకాయిల విడుదల కోసం గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నామని వారు తెలిపారు. మాజీ సీఎం జగన్ హయాంలో ఈ విషయాన్ని పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోయిందని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తమ డీఏ పెండింగ్ బకాయిల విడుదల ప్రారంభమైందని ఉద్యోగులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa