AP: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణగిరి KRP డ్యామ్‌లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నలుగురు కుటుంబసభ్యులు డ్యామ్‌లో దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అత్త శారదమ్మ , అల్లుడు లక్ష్మణ రావు మృతి చెందారు. లక్ష్మణ రావు భార్య జ్యోతి, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa