బాలికపై అత్యాచారం చేసి పరారీలో ఉన్న 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగింది. గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు తన సోదరి గ్రామానికి వెళ్తున్న 14 ఏళ్ల బాలికకు నిందితుడు కారులో లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం కారులోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. పరారీలో ఉన్న నిందితుడిని అతడి గ్రామంలోనే పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa