AP: అనకాపల్లికి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలింది. వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. అనకాపల్లిలో గురువారం నిర్వహించిన సమావేశంలో వైసీపీకి చెందిన చొక్కాకుల వెంకటరావు, ఇతడి సోదరుడు చొక్కాకుల గోవింద్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కార్పొరేటర్ గల్లా శ్రీను కూడా బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీ మాధవ్, ఎంపీ సీఎం రమేష్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa